అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Contaminated Water Packets | హైదరాబాద్ (Hyderabad) నగరంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. అఖరకు మంచినీటిని కూడా వదలడం లేదు. అక్రమంగా వాటర్ ప్లాంట్లు పెట్టి కలుషిత నీటిని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు.
నగరంలోని అంబర్‌పేటలో గల పలు వాటర్ ప్లాంట్లపై (Water plants) సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్‌సేఫ్టీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. కలుషితమైన పరిసరాల మధ్య, అపరిశుభ్రమైన పరిస్థితులలో నీటిని ప్యాకేజింగ్ చేస్తున్నందుకు అనేక ప్లాంట్లను సీల్ చేశారు. ఇలాంటి తక్కువ ధర గల సురక్షితం కాని తాగునీటిని సేవించడంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని అధికారులు హెచ్చరించారు.
Contaminated Water Packets | కలుషితమైన ప్యాకెట్లు
ప్యాకేజీ చేసిన తాగునీటిలో కూడా భారీ స్థాయిలో కల్తీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అనేక నీటి ప్యాకెట్లు కలుషితమైనట్లు తేలిందని తెలిపారు. సరైన అనుమతులు లేకుండా, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ నడుస్తున్న ప్లాంట్లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Contaminated Water Packets | కుళ్లిన బిర్యానీ డెలివరీ
నగరానికి చెందిన ఒక వ్యక్తి ఆన్లైన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. తీరా అది వచ్చాక తిందామని చూస్తే దుర్వాసన రావడం గమనించాడు. దీంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు జీడీమెట్ల (Jeedimetla)లో 3 రోజుల క్రితం వండి, మళ్లీ వేడి చేసి, డెలివరీ చేసిన 80 ప్యాకెట్లను ఒక స్థానిక అవుట్‌లెట్‌లో నిల్వ ఉంచినట్లు కనుగొన్నారు. అపరిశుభ్రత, ఫ్రిజ్‌లో ఎలుకలు కూడా ఉన్నట్లు గుర్తించారు. యజమాని ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేశారు. రెస్టారెంట్‌ను సీజ్ చేశారు.
ఇది కూడా చదవండి : ACB Raids Municipal | మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
