అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran Counter Attack | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రం అయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్‌లోని ఖార్గ్ ద్వీపం దాడులు ప్రారంభించాయి. మరోవైపు ఇరాన్ సైతం ట్రంప్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
యుద్ధంలో కొత్త దశాదిశ మొదలైందని ఇరాన్ పేర్కొంది. ఫతేహ్, ఖేబర్ షేకన్ మిస్సైళ్ల (Khyber Shekan Missiles)తో ఇక దాడులు రెండింతలు అవుతాయని హెచ్చరించింది. ట్రంప్ వైట్‌హౌస్ (White House)లో ఉన్న హిట్లర్ అంటూ ఇరాన్ వ్యాఖ్యలు చేసింది. మంగళవారం రాత్రిలోగా అమెరికా డిమాండ్లను అంగీకరించకపోతే, ఈ రాత్రే ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుందని ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి ఇరాన్ స్పందించింది. కాగా ఖార్గ్ ద్వీపంపై దాడి జరిగిందని, అక్కడ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
Iran Counter Attack | గల్ఫ్ దేశాలకు హెచ్చరికలు
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఏరోస్పేస్ దళాల కమాండర్ బ్రిగ్ జనరల్ సయ్యద్ మజీద్ మౌసావి ఓ వీడియో పోస్ట్ చేశారు. తమ మౌలిక సదుపాయాలపై జరిగిన దాడుల నేపథ్యంలో, ఇరాన్ తన క్షిపణి కార్యకలాపాలను పెంచుతోందని తెలిపారు. గల్ఫ్ దేశాలను IRGC హెచ్చరించింది. ఈ ప్రాంతంలోని చమురు, గ్యాస్‌ను అమెరికా, దాని ప్రాంతీయ భాగస్వాములు “సంవత్సరాల తరబడి” కోల్పోతారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో చమురు క్షేత్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేయనున్నట్లు తెలుస్తోంది
Iran Counter Attack | భారతీయులకు అడ్వైజరీ
ఇరాన్‌లోని భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. 48 గంటలపాటు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది. విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలు, అపార్ట్‌మెంట్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరించింది హైవేలపై వెళ్లాలనుకుంటే ఎంబసీతో సమన్వయం చేసుకోవాలని సూచించింది.
దీనిని కూడా చదవండి : Trump Final Warning | ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్
