అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Power Supply | ప్రజలకు మెరుగైన విద్యుత్తు సరఫరా చేసేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని ట్రాన్స్‌కో(Transco Meeting) గ్రిడ్ అండ్ ట్రాన్స్మిషన్ డైరెక్టర్ గాదె సంపత్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో నిజామాబాద్ (Nizamabad), కామారెడ్డి (Kamareddy), నిర్మల్, ఆదిలాబాద్(Adilabad) జిల్లాల అధికారులతో సమీక్ష(Power Supply Review) సమావేశం నిర్వహించారు.
Nizamabad Power Supply | డిమాండ్‌కు తగ్గట్లుగా సప్లయ్ ఉండాలి..
ఈ సందర్భంగా సంపత్‌రావు మాట్లాడుతూ.. వేసవిలో ఆయా జిల్లాల్లో ఎంతటి డిమాండ్(Energy Infrastructure) ఉన్నా దానికి తగ్గట్లుగా విద్యుత్తు సరఫరా (Summer Power Supply) చేసేవిధంగా అధికారులు సమాయత్తమవ్వాలన్నారు. 400 కేబీ, 220కేబీ, 132 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాల ద్వారా కరెంట్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత ట్రాన్స్‌కో అధికారులపై ఉందన్నారు. వినియోగదారులకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా సేవలందించాలని డిస్కం ఆపరేషన్ అధికారులను ఆదేశించారు.
Nizamabad Power Supply | ట్రాన్స్‌కో, డిస్కం ఆపరేషన్ అధికారులు..
ట్రాన్స్‌కో, డిస్కం ఆపరేషన్ అధికారులు సమన్వయంతో ఉంటూ వినియోగదారులకు వేసవిలో నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని సంపత్‌రావు అన్నారు. ఎక్కడైనా పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం పెంచేందుకు ప్రపోజల్స్ ఉంటే పంపాలని సూచించారు. వేవవిలో 24 గంటలు విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఓఎంసీ కరీంనగర్ జోన్ సీఈ విజయ్ కుమార్, పాపారావు, ఓఎంసీ ఎస్ఈ పీవీ రావు, ఎస్ఈ రవికుమార్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఆపరేషన్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్‌రావు, కామారెడ్డి ఆపరేషన్ ఎస్ఈ శాలియా నాయక్, డీఈలు, ఏడీలు ఏఈలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Uterine Prolapse | గర్భసంచి జారిందా.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు!
