అక్షరటుడే, వెబ్డెస్క్: H1B Visa Changes | అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ వీసా విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసే ఆలోచనలో ఆ దేశ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. దాని స్థానంలో వేతన ఆధారిత ఎంపిక (Wage-Based Selection) విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
H1B Visa Changes | కంప్యూటర్ ఆధారిత యాదృచ్ఛిక లాటరీ
హెచ్-1బీ వీసా కోసం ఏటా లక్షలాది మంది విదేశీయులు దరఖాస్తు చేసుకుంటారు. అయితే, అందుబాటులో ఉన్న పరిమిత కోటా కారణంగా ఇప్పటివరకు కంప్యూటర్ ఆధారిత యాదృచ్ఛిక లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేసేవారు. ఈ విధానంలో ప్రతిభ, అనుభవం, వేతనం వంటి అంశాలకు అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు.
H1B Visa Changes | ఇకపై నైపుణ్యాలకు ప్రాధాన్యం..
కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఇకపై అధిక వేతనం, అధిక నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తూ ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తద్వారా అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడం, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత మేలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
ఈ మార్పు భారత్ ఐటీ నిపుణులపై గణనీయ ప్రభావం చూపే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ వేతన జీవులకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, అధిక నైపుణ్యాలు, అనుభవం ఉన్నవారికి ఇది అనుకూలంగా మారవచ్చని పేర్కొంటున్నారు.
దీనిని కూడా చదవండి : Trump Final Warning | ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్
