అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bushehr Nuclear Tension | ఇరాన్‌లోని బుషెహర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇందుకు తీవ్రమైన భద్రతా ఆందోళనలు కారణంగా అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇరాన్లో క్రియాశీలకంగా ఉన్న ఏకైక అణు విద్యుత్ కేంద్రం అయిన బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సమీపంలో ఇటీవల జరిగిన దాడులు ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
Bushehr Nuclear Tension | అత్యంత సమీపంలో దాడులు..
ఇటీవలి కాలంలో అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో బుషెహర్ అణు కేంద్రం పరిసర ప్రాంతాల్లో పలు సార్లు వైమానిక దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఒకటి ప్లాంట్‌కు అత్యంత సమీపంగా — దాదాపు 75 మీటర్ల దూరంలో పడినట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ధృవీకరించింది.
దాడుల్లో ఒక ఉద్యోగి మృతి చెందగా, కొన్ని భవనాలకు నష్టం వాటిల్లింది. అయితే ప్రధాన అణు రియాక్టర్‌కు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
Bushehr Nuclear Tension | మరింత ప్రమాదకరం..
ప్రస్తుతం పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అణు కేంద్రం సమీపంలో దాడులు కొనసాగితే, తీవ్రమైన రేడియేషన్ తలెత్తే ప్రమాదం ఉందని IAEA స్పష్టం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో స్థానిక ప్రజల్లో మరింత భయం పెరిగింది. అణు ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్న ఆందోళనతో స్థానిక ప్రజలు వీధుల్లోకి వచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు, బుషెహర్ ప్రాంతం గల్ఫ్ దేశాలకు సైతం కీలకం కావడంతో, అక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా పలు దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
BREAKING 🚨People are out on the streets in Bushehr home to Iran’s nuclear power plant.
What’s REALLY happening there right now? pic.twitter.com/IwmgBRQ8GK
— Pushpendra Singh (@pushpendrakum) April 7, 2026
దీనిని కూడా చదవండి: H1B Visa Changes | H-1B లాటరీ విధానం రద్దు.. ఇకపై వేతన ఆధారంగానే!
