Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Ceasefire Deal | ఇరాన్‌పై దాడులు తాత్కాలికంగా నిలిపివేత.. రెండు వారాల కాలపరిమితి ప్రకటించిన ట్రంప్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Ceasefire Deal | ఇరాన్‌పై దాడులు తాత్కాలికంగా నిలిపివేత.. రెండు వారాల కాలపరిమితి ప్రకటించిన ట్రంప్

అంతర్జాతీయంతాజా వార్తలు

Iran Ceasefire Deal | ఇరాన్‌పై దాడులు తాత్కాలికంగా నిలిపివేత.. రెండు వారాల కాలపరిమితి ప్రకటించిన ట్రంప్

తాజా పరిణామం అంతర్జాతీయ వేదికపై కీలకంగా మారింది. మధ్యప్రాచ్య దేశాలు, ప్రపంచ శక్తులు ఈ తాత్కాలిక కాల్పుల విరమణను స్వాగతిస్తున్నాయి. అయితే, ఈ చర్చలు విజయవంతమై శాశ్వత శాంతి ఒప్పందంగా మారుతాయా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 8, 2026 7:29 ఉద.
Naresh chandan
21 గంటలు ago
Share
Iran Ceasefire Deal
Iran Ceasefire Deal

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Ceasefire Deal | ఇరాన్‌పై సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌ తో జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

Contents
  • Iran Ceasefire Deal | ద్వైపాక్షిక కాల్పుల విరమణ
    • Iran Ceasefire Deal | శాంతి ఒప్పందం దిశగా చర్చలు

Iran Ceasefire Deal | ద్వైపాక్షిక కాల్పుల విరమణ

ఇరాన్ వెంటనే హోర్ముజ్ జలసంధిని తెరవడానికి అంగీకరిస్తే.. రెండు వారాల పాటు బాంబుదాడులు, సైనిక చర్యలను నిలిపివేయడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు. పరస్పర అంగీకారంతో అమలయ్యే ద్వైపాక్షిక కాల్పుల విరమణ (Ceasefire)గా ఈ నిర్ణయాన్ని వర్ణించారు.

Iran Ceasefire Deal | శాంతి ఒప్పందం దిశగా చర్చలు

అమెరికా తన సైనిక లక్ష్యాలను ఇప్పటికే సాధించిందని ట్రంప్​ పేర్కొన్నారు. ఇరాన్‌తో దీర్ఘకాలిక శాంతి ఒప్పందం దిశగా చర్చలు ముందుకు సాగుతున్నాయన్నారు. ఇరాన్ యొక్క 10 అంశాల ప్రతిపాదన చర్చలకు పునాది అని అన్నారు. గతంలోని వివాదాస్పద అంశాల్లో చాలా వరకు రెండు దేశాలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చాయని వివరించారు.

ఈ రెండు వారాల విరామంలో తుది ఒప్పందాన్ని ఖరారు చేస్తామన్నారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడమే అమెరికా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Bushehr Nuclear Tension | బుషెహర్‌లో ఆందోళన వాతావరణం.. అణు కేంద్రం సమీపంలో ఉద్రిక్తతలు

Cockroach Facts | తల తెగిపోయినా వారం రోజులు జీవం.. ఏమిటీ వింత జీవులు?
Drunk Driving WhatsApp Group | మందుబాబుల మాస్టర్​ ప్లాన్​.. షాకిచ్చిన ఎస్సై
Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..
Gold Price Fall | దిగివస్తున్న బంగారం ధర.. ఆల్ టైం హైనుంచి సగం తగ్గిన వెండి
Sonia Gandhi Health | సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీ గంగారాం ఆసుపత్రికి తరలింపు!
TAGGED:breaking world newsgeopolitics newsglobal diplomacyiran ceasefireIran Ceasefire DealMiddle East peaceStrait of Hormuztrump iran newsUS Iran conflict
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 08 Horoscope April 08 Horoscope | జాబ్ ఆఫర్స్.. కొత్త బిజినెస్ డీల్స్.. ఈ రాశుల వారికి గోల్డెన్ టైం!
Next Article Temple Pradakshina Secrets Temple Pradakshina Secrets | గుడిలో ప్రదక్షిణలు చేస్తున్నారా.. అయితే ఈ రహస్యం తెలుసుకోవాల్సిందే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?