అక్షరటుడే, న్యూఢిల్లీ: April 08 Pre Market Analysis | హార్మూజ్ జలసంధి(Strait of Hormuz)ని తెరవకపోతే ఇరాన్‌కు మంగళవారం కాళరాత్రే అన్న ట్రంప్.. ఒక్కసారిగా వెనకడుగు వేశారు. ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించారు.
హార్మూజ్ మీదుగా నౌకల రాకపోకలను పునరుద్ధరించేందుకు టెహ్రాన్ సైతం అంగీకరించడంతో క్రూడ్ ఆయిల్ ధరలు దిగివస్తున్నాయి. ఈ పరిణామాలతో గ్లోబల్ మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది.
April 08 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.03 శాతం నష్టంతో, ఎస్ అండ్ పీ 0.08 శాతం లాభంతో ముగిశాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్(Dow Jones Futures) 2.27 శాతం లాభంతో ఉంది.
April 08 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్(DAX) 1.08 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.85 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.68 శాతం నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు భారీ లాభాల దిశగా సాగుతున్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 5.93 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 5.06 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 4.15 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 2.57 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.53 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.85 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 2.93 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా 25వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 8,692 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐ(DII)లు వరుసగా 27వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 7,979 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.22 నుంచి 1.13 కి తగ్గింది.
- విక్స్ 3.03 శాతం తగ్గి 24.70 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 లు బలపడి 92.98 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 13.97 శాతం తగ్గి, 95.30 డాలర్ల వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: Iran Ceasefire Deal | ఇరాన్‌పై దాడులు తాత్కాలికంగా నిలిపివేత.. రెండు వారాల కాలపరిమితి ప్రకటించిన ట్రంప్
