Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Crude Oil Prices Drop | సీజ్ ఫైర్ ప్రకటన.. భారీగా పడిపోయిన చమురు ధరలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Crude Oil Prices Drop | సీజ్ ఫైర్ ప్రకటన.. భారీగా పడిపోయిన చమురు ధరలు

బిజినెస్​తాజా వార్తలు

Crude Oil Prices Drop | సీజ్ ఫైర్ ప్రకటన.. భారీగా పడిపోయిన చమురు ధరలు

ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ ప్రకటనతో క్రూడ్ ఆయిల్ ధర దిగివస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 8, 2026 9:44 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
17 గంటలు ago
Share
Crude Oil Prices Drop

అక్షరటుడే, వెబ్​డెస్క్: Crude Oil Prices Drop | పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధంలో రెండు వారాల పాటు కాల్పులు విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. సీజ్ ఫైర్ కాలంలో హార్మూజ్‌ను (Strait of Hormuz) తెరిచేందుకు ఇరాన్ కూడా ఒప్పుకుంది.

Contents
  • Crude Oil Prices Drop | భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్..
    • Crude Oil Prices Drop | అనూహ్యంగా కాల్పుల విరమణ..

ఇరాన్ సాయుధ దళాల సమన్వయంతో సురక్షితంగా నౌకలు ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ తెలిపారు. ఈ నిర్ణయంతో ముడి చమురు ధరలు 15 శాతానికిపైగా పతనమయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్లు (Stock Markets) భారీ లాభాల దిశగా సాగుతున్నాయి.

Crude Oil Prices Drop | భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్..

ఇరాన్ – అమెరికాల మధ్య ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. అమెరికా (America) భీకర దాడులు, ఇరాన్ దీటైన ప్రతిస్పందనతో పశ్చిమాసియా అట్టుడికింది. ఈ నేపథ్యంలోనే అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసి వేసింది. ప్రపంచ సరుకు రవాణాకు కీలకమైన ఈ జలసంధిని మూసి వేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు గణనీయంగా పెరిగాయి. యుద్ధం ప్రారంభానికి ముందు బ్యారెల్‌కు 70 డాలర్లలోపు ఉన్న క్రూడ్ ఆయిల్ ధర.. గరిష్టంగా 120 డాలర్లను దాటింది. క్రితం సెషన్లలో 111 డాలర్ల వద్ద ఉంది.

Crude Oil Prices Drop | అనూహ్యంగా కాల్పుల విరమణ..

హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ నాగరికతను అంతం చేస్తామంటూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ (US President Trump) చేసిన హెచ్చరికలతో కొంత ఆందోళన కనిపించింది. దీనికి మంగళవారం రాత్రిని తుది గడువుగా నిర్ణయించింది. అయితే అనూహ్యంగా గడువు ముగిసే సమయంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల బ్రేక్ ఇచ్చారు. ఇరాన్ సైతం హార్మూజ్ నుంచి నౌకల రవాణాకు అంగీకరించింది. సీజ్ ఫైర్ ప్రకటనతో క్రూడ్ ఆయిల్ ధర దిగివచ్చింది. గరిష్ఠాల నుంచి భారీగా పడిపోయింది. బుధవారం ఉదయం బ్యారెల్ ధర 95 డాలర్ల దిగువ ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి..: Gold Silver Rates Today | మరింత తగ్గిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా ఈ రోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..!

Sri Lanka Fuel Prices | శ్రీలంకలో భారీగా పెరిగిన ఇంధన ధరలు
Summer Health Tips | మండుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాపాయం: డాక్టర్​ ఆనంద్​ మాలు
Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి
Vivo V70 FE 5G | 200 ఎంపీ కెమెరాతో వీవో నుంచి బెస్ట్ ఫోన్
KPHB Minor Theft Case | పీహెచ్‌బీలో కలకలం.. సారీ అని లేఖ రాసి రూ.25 లక్షల నగదు, బంగారంతో మైనర్ పరార్
TAGGED:AmericaCrude OilCrude Oil Prices Dropenergy market updatefuel prices todayglobal oil marketiran us ceasefireoil price dropoil price newsstock market impactStock MarketsStrait of HormuzUS President Trump
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nosebleeds in Summer Nosebleeds in Summer | వేసవిలో ముక్కు నుండి రక్తం వస్తోందా? భయపడకండి.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు!
Next Article Bikes Set on Fire Bikes | ద్విచక్ర వాహనాలకు నిప్పు.. కాలిబూడిదైన బైకులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?