Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Iran Ceasefire | ప్రపంచ శాంతికి గొప్ప రోజు.. సీజ్​ఫైర్​పై ట్రంప్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Iran Ceasefire | ప్రపంచ శాంతికి గొప్ప రోజు.. సీజ్​ఫైర్​పై ట్రంప్​

అంతర్జాతీయం

Trump Iran Ceasefire | ప్రపంచ శాంతికి గొప్ప రోజు.. సీజ్​ఫైర్​పై ట్రంప్​

కాల్పుల విరమణపై సోషల్​ మీడియా వేదికగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ స్పందించారు. ప్రపంచ శాంతికి ఇదొక గొప్ప రోజు అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 8, 2026 10:41 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
16 గంటలు ago
Share
Trump Iran Ceasefire

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Iran Ceasefire | అమెరికా–ఇరాన్​ కాల్పుల విరమణపై సోషల్​ మీడియా (Social Media) వేదికగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ స్పందించారు. ప్రపంచ శాంతికి ఇదొక గొప్ప రోజు అంటూ పోస్ట్ చేశారు. పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతుందంటూ వ్యాఖ్యానించారు.

నెల రోజులకు పైగా రగులుతున్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. రెండు వారాల సీజ్​ఫైర్​కు ఇరాన్​, అమెరికా అంగీకరించడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం రాత్రి ఇరాన్​ (Iran) పై పెద్ద ఎత్తున దాడులు చేస్తామని, నాగరికతను అంతం చేస్తామని ట్రంప్​ (Donald Trump) ప్రకటించడంతో ఏం జరుగుతుందోనని అంత భయపడ్డారు. అయితే ఇరు దేశాలు ప్రాథమిక చర్చల అనంతరం సీజ్​ఫైర్​కు అంగీకరించాయి. ఈ నెల 10న ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ చర్చలు జరపనున్నాయి. యుద్ధం శాశ్వత ముగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.

Trump Iran Ceasefire | సానుకూల చర్యలు

ప్రపంచ శాంతికి ఇది ఒక గొప్ప రోజు! ఇది జరగాలని ఇరాన్ కోరుకుంటోంది, వారికి ఇక చాలు అనిపించింది! అలాగే, మిగతా అందరికీ కూడా అని ట్రంప్​ తన సోషల్​ మీడియా ఖాతాలో పోస్ట్​ చేశారు. హర్ముజ్​ జలసంధిలో రద్దీని నియంత్రించడంలో, కాల్పుల విరమణ కాలంలో స్థిరత్వాన్ని నిర్ధారించడంలో యునైటెడ్ స్టేట్స్ సహాయపడుతుందని తెలిపారు. చాలా సానుకూల చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇరాన్ పునర్నిర్మాణ ప్రయత్నాలను ప్రారంభించవచ్చని సూచించారు. ఈ ఒప్పందం నిలబడేలా చూడటానికి అమెరికా (America) అన్ని రకాల సామగ్రిని పంపిస్తుందని, అక్కడే ఉంటుందని అన్నారు. అది నిలబడుతుందని తనకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Iran Ceasefire Deal | ఇరాన్‌పై దాడులు తాత్కాలికంగా నిలిపివేత.. రెండు వారాల కాలపరిమితి ప్రకటించిన ట్రంప్

Iran Ceasefire | ఇరాన్‌ సీజ్‌ ఫైర్‌ కోసం అడుక్కుంది.. అమెరికా సంచలన వ్యాఖ్యలు
US Israel Attack | ఇరాన్​పై అమెరికా–ఇజ్రాయెల్​ దాడులు.. 17 మంది మృతి
Iran attacks | కువైట్, దుబాయ్​పై ఇరాన్ దాడులు
Pakistan Stock Market Crash | కుప్పకూలిన పాకిస్తాన్‌ స్టాక్‌ మార్కెట్‌.. 45 నిమిషాలు నిలిచిపోయిన ‍ట్రేడింగ్‌
Iran Ceasefire Deal | ఇరాన్‌పై దాడులు తాత్కాలికంగా నిలిపివేత.. రెండు వారాల కాలపరిమితి ప్రకటించిన ట్రంప్
TAGGED:ceasefire agreementgeopolitics newsglobal peace newsIran US talksMiddle East tensionstrump iran ceasefireTrump statementUS Iran conflict
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Toll Rules Change Toll Rules Change | ఏప్రిల్ 10 నుంచి టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు.. నగదు రద్దు, కొత్త విధానం అమలు
Next Article RBI Repo Rate RBI Repo Rate | వడ్డీ రేట్లు యథాతథం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?