అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pawan Kalyan Family Emotional Day | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుటుంబానికి ఏప్రిల్ 8 ఎప్పటికీ మరువలేని రోజు. ఈ తేదీ వారి జీవితాల్లో సంతోషం, బాధ రెండింటినీ కలగలిపిన ఒక ప్రత్యేక గుర్తుగా నిలిచిపోయింది. మొదటగా, పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ పుట్టినరోజు ఈరోజే. ప్రతి సంవత్సరం ఈ రోజున అభిమానులు సోషల్ మీడియాలో అకిరాకు శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేస్తారు.
గతంలో ఈ రోజు పూర్తి హ్యాపీ మూడ్‌లో గడిచేది. అయితే గత సంవత్సరం జరిగిన ఒక ఘటన ఈ రోజుకు కొత్త అర్థాన్ని తెచ్చింది. పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ (Singapore)లో చదువుకుంటున్న పాఠశాలలో అనుకోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా, మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఇబ్బంది తలెత్తడంతో ఆయనకు చికిత్స అందించారు.
Pawan Kalyan Family Emotional Day | అన్నా ఎమోషనల్..
ఈ ఘటనతో పవన్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. అయితే వైద్యుల శ్రద్ధతో మార్క్ శంకర్ క్రమంగా కోలుకొని సురక్షితంగా బయటపడటం కుటుంబానికి పెద్ద ఉపశమనం కలిగించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల (Anna Konidela) సోషల్ మీడియాలో స్పందిస్తూ, “ఏప్రిల్ 8 మా కుటుంబానికి ఎమోషనల్ డే” అని పేర్కొన్నారు. మార్క్ శంకర్ (Mark Shankar) ఆరోగ్యంగా తిరిగి రావడంతో పవన్ కుటుంబం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంను దర్శించి తలనీలాలు సమర్పించింది. ఆ ఫోటోలను అన్నా సోషల్ మీడియాలో షేర్ చేయగా, అభిమానులు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.
Pawan Kalyan Family Emotional Day | సింగపూర్ స్కూల్ ఫైర్ యాక్సిడెంట్
ఇప్పటికీ ఆ సింగపూర్ స్కూల్ ఫైర్ యాక్సిడెంట్ (Fire Accident) కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ ఘటన పవన్ కుటుంబాన్ని ఎంతగా కలిచివేసిందో, అలాగే జీవితం ఎంత విలువైనదో మరోసారి గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 8 వచ్చిందంటే పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఒకవైపు ఆనందం, మరోవైపు భావోద్వేగ క్షణాల మేళవింపుగా మారింది.మరోవైపు అన్నా ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటుంది.
ఇది కూడా చదవండి..: Trisha Marriage Rumors | రిటైర్మెంట్, పెళ్లి రూమర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష.. ఇది చాలా, ఇంకా కావాలా?
