అక్షరటుడే, వెబ్డెస్క్: Kandukurthi Development | కందకుర్తి గ్రామ సమగ్రాభివృద్ధి కోసం ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy)ని కలిసి కందకుర్తి అభివృద్ధి సమగ్రంగా చర్చించారు.
Kandukurthi Development | కందకుర్తి స్మృతి మందిరానికి రోడ్డు
మహారాష్ట్ర (Maharashtra) సరిహద్దులో గల జాతీయ రహదారి నుంచి కందకుర్తి స్మృతి మందిరానికి అనుసంధానమయ్యేలా రహదారి మంజూరుకు ఎంపీ అర్వింద్ ప్రత్యేకంగా కృషి చేశారు. అవసరమైన నిధులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. అంతేకాకుండా పనులు వేగంగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులతో ఎంపీ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పర్యవేక్షిస్తున్నారు.
Kandukurthi Development | నవీపేట – కందకుర్తి ప్రధాన రహదారికి మరమ్మతులు
నవీపేట – కందకుర్తి ప్రధాన రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేయించడంలో ఎంపీ అర్వింద్ కీలక పాత్ర పోషించారు. రహదారి అభివృద్ధి వల్ల ప్రాంతీయ రవాణా వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతం లభించనుంది.
Kandukurthi Development | 11న కందకుర్తికి మోహన్ భగవత్
కందకుర్తి (Kandakurthi)లో నిర్మిస్తున్న కేశవ స్ఫూర్తి మందిర ప్రారంభోత్సవానికి ఈ నెల 11న మోహన్ భగవత్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కందకుర్తికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంతో పాటు, ప్రాంతీయంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను పెంచనుంది.
Kandukurthi Development | పుష్కర ఘాట్ల నిర్మాణంపై దృష్టి
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో కందకుర్తిలో వీఐపీ ఘాట్ నిర్మాణానికి సంబంధించి ఎంపీ అర్వింద్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు కల్పించేందుకు, పుష్కరాల సమయంలో రాకపోకలు సులభంగా ఉండేలా అన్ని చర్యలు చేపడుతున్నారు. ఈ ఘాట్ నిర్మాణం పూర్తయితే భక్తులకు సురక్షితమైన స్నాన వసతులు లభించడమే కాకుండా, కందకుర్తి ప్రాంతానికి పర్యాటక ప్రాధాన్యత కూడా పెరుగనుంది. కందకుర్తి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఎంపీ అర్వింద్ తీసుకుంటున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: RTC Relay Hunger Strike | ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే నిరాహార దీక్ష
