అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Congress Suspensions | జిల్లా కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ముగ్గురిపై సస్పెండ్ చేస్తూ బుధవారం కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) ఉత్తర్వులు జారీ చేశారు.
Nizamabad Congress Suspensions | కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు..
డీసీసీ (DCC Nizamabad) కార్యాలయంలో బుధవారం కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష (Kisan Nyay Satyagraha Protest) నిర్వహించారు. కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి (Nagesh reddy), నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (State Seed Development Corporation) ఛైర్మన్ అన్వేష్‌రెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు జీవీ రామకృష్ణ, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, ఉర్దూ అకాడమీ (Urdu Academy) ఛైర్మన్ తాహెర్ తదితరులు హాజరయ్యారు. అయితే కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, 48వ డివిజన్ మాజీ అధ్యక్షుడు పుండ్ర సాయి కుమార్, మాజీ ఎన్ఎస్యూఐ నాయకుడు నరేన్ దీప్ తదితరులు మానాల మోహన్ రెడ్డి బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేసేందుకు ఉపక్రమించారు.
Nizamabad Congress Suspensions | క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించినందుకు..
ఈ క్రమంలో అక్కడ బర్త్‌డే కార్యక్రమాలు నిర్వహించవద్దని తాము పేర్కొన్నామని.. అయినప్పటికీ వేణురాజ్తో సహా మరో ఇద్దరు వ్యక్తులు క్రమశిక్షణ నిబంధనలను ఉల్లఘించారని బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. యూత్ కాంగ్రెస్ కార్యక్రమ నిర్వహణకు ఇబ్బంది కలిగిస్తూ వేడుకలు నిర్వహించినందున వేణురాజ్, వుండ్ర సాయికుమార్, నరేన్ దీప్‌లను పార్టీనుంచి సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి నుంచి ఈ ముగ్గురితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రకటనలో తెలిపారు.
ఇది కూడా చదవండి: Farmer Welfare Programs | రైతు సంక్షేమమే ధ్యేయం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
