అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Athletics Selection | రాష్ట్రస్థాయిలో నిర్వహించే అథ్లెటిక్స్ పోటీలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Kamareddy Government Degree College) నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. బుధవారం ఇందిరాగాంధీ స్టేడియంలో (Indira Gandhi Stadium) నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ (District Athletics) కనబర్చి రాష్ట్రస్థాయికి (State Level Sports) ఎంపికయ్యారు.
Kamareddy Athletics Selection | కళాశాలలో..
అథ్లెటిక్స్ 1500 మీటర్ల పరుగు పందెం, అండర్-20 విభాగంలో బీస్సీ బీజెడ్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పి.జ్ఞానేశ్వర్, 1500 మీటర్ల పరుగు పందెం, పురుషుల విభాగం నుంచి బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంశీ, జావెలిన్ త్రో అండర్-20 విభాగంలో బీఎస్సీ బీజెడ్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సాయి రోహిత్, జావెలిన్ త్రో పురుషుల విభాగంలో బీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఇన్ఛార్జి పీడీ డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 11, 12 తేదీల్లో వరంగల్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కళాశాల తరపున ప్రాతినిథ్యం వహించనున్నారు.
Kamareddy Athletics Selection | ప్రిన్సిపాల్ అభినందన..
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమార్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణను, పట్టుదలను పెంచుతాయన్నారు. కళాశాల విద్యార్థులు (Kamareddy News) చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. వరంగల్‌లో జరగబోయే పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.కిష్టయ్య కళాశాల వివిధ విభాగాల అధ్యాపకులు, ఆఫీస్ సిబ్బంది విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Farmer Welfare Programs | రైతు సంక్షేమమే ధ్యేయం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
