Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Midwifery Training | ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో మిడ్​వైఫరీ ట్రైనింగ్ : మంత్రి రాజనర్సింహ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Midwifery Training | ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో మిడ్​వైఫరీ ట్రైనింగ్ : మంత్రి రాజనర్సింహ

తెలంగాణ

Midwifery Training | ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో మిడ్​వైఫరీ ట్రైనింగ్ : మంత్రి రాజనర్సింహ

ప్రభుత్వ నర్సింగ్​ కాలేజీల్లో మిడ్‌వైఫరీ ట్రైనింగ్ ప్రారంభిస్తామని మంత్రి దామోదర్​ రాజనర్సింహ తెలిపారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 8, 2026 6:48 సా.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
Midwifery Training

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Midwifery Training | ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో మిడ్​వైఫరీ ట్రైనింగ్ త్వరలో ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్​ రాజనర్సింహ (Rajanarsihma) అన్నారు. సిజేరియన్ డెలివరీలను తగ్గించి.. నార్మల్ డెలివరీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

Contents
  • Midwifery Training | ఉచితంగా పరీక్షలు
    • Midwifery Training | ఆరోగ్య మహిళ కార్యక్రమం

బోయగూడలోని మిడ్‌వైఫరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ (Midwifery Training Institute)లో జరిగిన సేఫ్ మదర్ హుడ్ డే వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో నర్సింగ్ ఆఫీసర్ల నియామకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రెండేళ్లలో 10 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేశామని వెల్లడించారు. ఇందులో నర్సింగ్ పోస్టులే అధికంగా ఉన్నాయన్నారు. రెండు మూడు రోజుల్లో మరో 2,322 నర్సింగ్ పోస్టుల భర్తీ పూర్తవుతుందని పేర్కొన్నారు. కొత్త నర్సింగ్ కాలేజీలు స్థాపించి, విద్యార్థులకు అవకాశాలు పెంచుతున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాల కోసం నర్సింగ్ స్టూడెంట్స్‌కు ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ భాషల్లో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.

Midwifery Training | ఉచితంగా పరీక్షలు

గర్భిణులకు ప్రభుత్వ హాస్పిటళ్లలో సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉచితంగా యాంటీనేటల్ చెకప్‌లు, స్కానింగ్‌లు, అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి, ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

Midwifery Training | ఆరోగ్య మహిళ కార్యక్రమం

ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు మంత్రి రాజనర్సింహ తెలిపారు. 46 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా 30 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. సర్వైకల్ కేన్సర్‌ను అరికట్టేందుకు బాలికలకు HPV వ్యాక్సినేషన్​ చేపట్టామన్నారు. సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు మిడ్‌వైఫరీ సేవలను రాష్ట్రంలో బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 370 మంది నర్సులకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ పూర్తయిందని తెలిపారు.

ఇది కూడా చదవండి : Teachers Caught by ACB | ఏసీబీకి చిక్కిన ఎంఈవో, ఉపాధ్యాయుడు

Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
Parental Care Bill | ‘తల్లిదండ్రుల సంరక్షణ చట్టం’ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సీఎం రేవంత్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Hyderabad Rain Traffic | ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్​… హైదరాబాద్​లో వాహనదారుల ఇక్కట్లు!
Cancer Notifiable Disease | ప్రభుత్వం కీలక నిర్ణయం.. నోటిఫైడ్​ డిసీజ్​గా క్యాన్సర్​
Handloom Workers Issue | చేనేత కార్మికుల పొట్ట కొడుతున్న ప్రభుత్వం : కవిత
TAGGED:government hospitals Indiamaternal healthcaremidwifery trainingnormal delivery promotionnursing colleges Indianursing jobs
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Athletics Selection | Kamareddy Athletics Selection | రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు డిగ్రీ కళాశాల విద్యార్థులు
Next Article 2 BHK Shops Auction 2 BHK Shops Auction | డబుల్​ బెడ్​ రూమ్​ కాలనీల్లో దుకాణాలకు వేలం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?