Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Farmers Trade Deal Issue | రైతులకు అన్యాయం చేస్తూ విదేశాలతో కేంద్రం ఒప్పందాలు: డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Farmers Trade Deal Issue | రైతులకు అన్యాయం చేస్తూ విదేశాలతో కేంద్రం ఒప్పందాలు: డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి

నిజామాబాద్

Farmers Trade Deal Issue | రైతులకు అన్యాయం చేస్తూ విదేశాలతో కేంద్రం ఒప్పందాలు: డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి

దేశరైతులకు అన్యాయం చేస్తూ కేంద్రం విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోందని డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి అన్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యాలయంలో సత్యాగ్రహ దీక్ష చేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 8, 2026 8:54 సా.
Shashi kiran Mottala
9 గంటలు ago
Share
Farmers Trade Deal Issue |
Farmers Trade Deal Issue | కేంద్రం దేశ రైతులకు అన్యాయం చేస్తూ విదేశాలతో ఒప్పందాలు చేస్తోంది..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: Farmers Trade Deal Issue | దేశరైతులకు అన్యాయం చేస్తూ కేంద్రం విదేశాలతో ఒప్పందాలు (Agriculture Policy) కుదుర్చుకుంటోందని డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి (Nagesh Reddy) అన్నారు. జాతీయ యువజన కాంగ్రెస్ (National Youth Congress) ఆదేశాల మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో సత్యాగ్రహ దీక్ష చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు హాజరైన మాట్లడారు.

Contents
  • Farmers Trade Deal Issue | నల్లచట్టాలతో రైతుల పొట్టగొడుతున్నారు..
    • Farmers Trade Deal Issue | రైతుల ఉత్పత్తులకు గండి..

Farmers Trade Deal Issue | నల్లచట్టాలతో రైతుల పొట్టగొడుతున్నారు..

ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ రైతులకు అన్యాయం చేసే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో అమెరికా (America) వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే ఒప్పందం చేసుకుందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లచట్టాలను తెచ్చేందుకు ప్రయత్నించిందన్నారు. వాటికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాలు చేయడం ద్వారా వెనక్కి తీసుకుందన్నారు. మరొకసారి రైతులకు అన్యాయం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం యూఎస్​తో ట్రేడ్​డీల్ కుదుర్చుకుందని విమర్శించారు. దీంతో భారతదేశంలో ఉన్న రైతుల ఉత్పత్తులకు మద్దతు ధర తగ్గిపోతుందన్నారు.

Farmers Trade Deal Issue | రైతుల ఉత్పత్తులకు గండి..

అమెరికా నుంచి తక్కువ ధరకు ఉత్పత్తులు వస్తే దేశ రైతుల ఉత్పత్తులను ఎవరూ కొనుగోలు చేయరని.. తద్వారా రైతులకు మద్దతు ధర రావడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నగేష్​ రెడ్డి అన్నారు. రైతులు ఆర్థిక సంక్షోభానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్రంలో వర్షాల వల్ల వడ్లు రాలిపోయి రైతులు నష్టపోయారని కలెక్టర్​ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారన్నారు.  కానీ వర్షం పడ్డ మరుసటి రోజే అధికారులు వెళ్లి నష్టపోయిన పంటను వివరాలు తెలుసుకున్న విషయం వారికి తెలియదన్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు కొంత సమయం పడుతుందన్నారు.

ఇకనైనా బీజేపీ నాయకులు కేంద్రంలో దేశ రైతులకు చేస్తున్న అన్యాయాలపై మాట్లాడాలని.. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు వెంటనే యూఎస్​తో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ రద్దుచేసి దేశ రైతులకు లాభం చేసే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు జీవీ రామకృష్ణ, డీసీసీ ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, గాదరి గోపి, డీసీసీ ట్రెజరీ భక్తవత్సలం, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Mohan Reddy Funeral | పాడే మోసిన షబ్బీర్ అలీ.. ముగిసిన మాజీ జడ్పీటీసీ అంత్యక్రియలు
Kamareddy Chairperson Election | కామారెడ్డి ఛైర్​పర్సన్​ ఎన్నిక చెల్లదు.. కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్​ కౌన్సిలర్​ అభ్యర్థి
Guest Faculty Salaries | గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనవెతలు.. ప్రిన్సిపాళ్ల మొండివైఖరితో ఇబ్బందులు
Student Death Investigation | విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల న్యాయపోరాటం.. పోస్టుమార్టంకు పోలీసుల ఆదేశం
Hanuman Shobha Yatra Security | హనుమాన్ శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్తు: సీపీ సాయిచైతన్య
TAGGED:Agriculture PolicyAmericaBJP vs Congresscongress party indiafarmers protest IndiaIndian Farmersnagesh reddyNational Youth CongressTrade Deal News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article 2 BHK Shops Auction 2 BHK Shops Auction | డబుల్​ బెడ్​ రూమ్​ కాలనీల్లో దుకాణాలకు వేలం
Next Article Trump Tariffs Trump Tariffs | మరోసారి షాక్​ ఇచ్చిన ట్రంప్​.. ఆ దేశాలపై 50 శాతం టారిఫ్​లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?