అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SI Transfers | జిల్లాలో ఆరుగురు ఎస్సైలకు (Kamareddy Police) స్థానచలనం కలిగింది. పరిపాలన మార్పుల దృష్ట్యా జిల్లాలో ఎస్సైలను (SI Transfers) ఇతర పోలీస్ స్టేషన్లకు అటాచ్ చేసినట్లు పోలీసు శాఖ ప్రకటించింది.
Kamareddy SI Transfers | జిల్లా ఎస్పీ ఆదేశాలతో..
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఆదేశాలతో బుధవారం సాయంత్రమే ఎస్సైలు వారికి కేటాయించిన పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసినట్లు (Police Department Transfers) తెలుస్తోంది. గాంధారి (Gandhari) ఎస్సై బి.ఆంజనేయులును పిట్లంకు అటాచ్ చేశారు. బీర్కూర్ ఎస్సై ఎం మహేందర్‌ను గాంధారికి బదిలీ చేశారు. జుక్కల్ ఎస్సై కె.నవీన్ చంద్రను బాన్సువాడకు, బాన్సువాడ (Banswada) ఎస్సై బి.మురళిని జుక్కల్‌కు అటాచ్ చేశారు. బాన్సువాడ ఎస్సై వీకే రాములును బీర్కూర్ పోలీస్ స్టేషన్‌కు, పిట్లం ఎస్సై టీ వెంకట్రావును బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
