Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 09 Pre market Analysis | సీజ్ ఫైర్ ఉల్లంఘనలు!.. నష్టాల్లో ఆసియా మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - April 09 Pre market Analysis | సీజ్ ఫైర్ ఉల్లంఘనలు!.. నష్టాల్లో ఆసియా మార్కెట్లు

బిజినెస్​తాజా వార్తలు

April 09 Pre market Analysis | సీజ్ ఫైర్ ఉల్లంఘనలు!.. నష్టాల్లో ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. గిఫ్ట్ నిఫ్టీ నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు సైతం గ్యాప్ డౌన్ లో ప్రారంభం కానున్నాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 9, 2026 8:32 ఉద.
Naresh chandan
11 గంటలు ago
Share
April 09 Pre market Analysis
April 09 Pre market Analysis

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 09 Pre market Analysis | అమెరికా, ఇరాన్‌ల మధ్య జరిగిన సీజ్ ఫైర్(Ceasefire) ఒప్పందంతో గత సెషన్‌లో స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. అయితే కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించినట్లు వస్తున్న వార్తలతో ఈ ఒప్పందంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

Contents
  • April 09 Pre market Analysis | యూఎస్ మార్కెట్లు..
    • April 09 Pre market Analysis | యూరోప్ మార్కెట్లు..
      • ఆసియా మార్కెట్లు..
      • గమనించాల్సిన అంశాలు..

కాల్పుల విరమణ ఒప్పందం నిలబడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.

April 09 Pre market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 2.80 శాతం, ఎస్ అండ్ పీ 2.51 శాతం లాభంతో ముగిశాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.02 శాతం నష్టంతో ఉంది.

April 09 Pre market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 4.81 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 4.30 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 2.45 శాతం లాభపడ్డాయి.

ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) భారీ లాభాల దిశగా సాగుతున్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.21 శాతం లాభంతో ఉండగా.. చైనాకు చెందిన షాంఘై 1.53 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.99 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.48 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.34 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.26 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.35 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ ఐఐలు వరుసగా 26వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,811 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 28వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,168 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.13 వద్ద స్థిరంగా ఉంది.
  • విక్స్ 20.24 శాతం తగ్గి 19.70 వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 41 లు బలపడి 92.58 వద్ద ఉంది.
  • కాల్పుల విరమణ ఒప్పందం నిలబడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ పెరుగుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.95 శాతం పెరిగి, 96.70 డాలర్ల వద్ద ఉంది.
  • సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి: Masik Krishna Janmashtami | మాసిక కృష్ణ జన్మాష్టమి.. ఈ చిన్న నియమాలు పాటిస్తే ఇంట్లో అన్నీ శుభాలే!

Rotten Meat Racket | హైదరాబాద్‌లో కల్తీ మాంసం కలకలం.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం
March 16 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు కాస్త‌ ఊరట
RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
Gold Jewelry Buying | నగలు రెడీమేడ్​ తీసుకోవాలా..? చేయించాలా..? నిపుణులు ఏమంటున్నారంటే!
Raj Gopal Reddy Dinner | కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!
TAGGED:april 09 pre marketApril 09 Pre market AnalysisCrude Oil ImpactFII DII dataglobal markets updatenifty predictionPre Market Analysisshare market indiastock market today
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kids Toothpaste Safety Kids Toothpaste Safety | పిల్లలు టూత్‌పేస్ట్ మింగుతున్నారా.. అయితే ఈ ప్రమాదాలు తప్పవు!
Next Article April 09 Gold Rates April 09 Gold Rates | ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల ప్రభావం.. ఎగసిపడుతున్న బంగారం, వెండి ధరలు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?