Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Punjab Gangster Crackdown | గ్యాంగ్‌స్టర్లపై భారీ దాడులు.. ఒక్కరోజే 202 అరెస్టులు, జోరుగా ‘యాంటీ గ్యాంగ్‌స్టర్’ ఆపరేషన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Punjab Gangster Crackdown | గ్యాంగ్‌స్టర్లపై భారీ దాడులు.. ఒక్కరోజే 202 అరెస్టులు, జోరుగా ‘యాంటీ గ్యాంగ్‌స్టర్’ ఆపరేషన్

జాతీయం

Punjab Gangster Crackdown | గ్యాంగ్‌స్టర్లపై భారీ దాడులు.. ఒక్కరోజే 202 అరెస్టులు, జోరుగా ‘యాంటీ గ్యాంగ్‌స్టర్’ ఆపరేషన్

పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ మాఫియాపై ఏఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఒక్కరోజే 501 చోట్ల దాడులు చేసి 202 మందిని అరెస్ట్ చేయడం సంచలనం రేపింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 9, 2026 9:33 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
Punjab Gangster Crackdown

అక్షరటుడే, వెబ్​డెస్క్​:  Punjab Gangster Crackdown | పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ మాఫియాపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం (Aam Aadmi Party Government) కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి భ‌గ‌వంత్ మ‌న్‌ (CM Bhagwant Mann) ఆదేశాల మేరకు చేపట్టిన ‘యాంటీ గ్యాంగ్‌స్టర్’ ఆపరేషన్ రాష్ట్రవ్యాప్తంగా దూకుడుగా సాగుతోంది.

Contents
  • Punjab Gangster Crackdown | AGTFతో కలిసి సంయుక్త చర్యలు
    • Punjab Gangster Crackdown | పంజాబ్‌ గ్యాంగ్‌స్టర్లలో భయం

బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 501 ప్రాంతాల్లో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఏకంగా 202 మందిని అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌స్టర్లకు సహకరిస్తున్న అనుచరులను, వారి నెట్‌వర్క్‌ను ఛేదించడమే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Punjab Gangster Crackdown | AGTFతో కలిసి సంయుక్త చర్యలు

యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ (Anti-Gangster Task Force)తో పాటు అన్ని జిల్లాల పోలీసులు సమన్వయంతో ఈ దాడుల్లో పాల్గొన్నారు. కేవలం అరెస్టులు మాత్రమే కాకుండా, పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక గాలింపు చర్యలు కూడా చేపట్టారు. గ్యాంగ్‌స్టర్లతో పాటు డ్రగ్స్ మాఫియాపై కూడా ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఈ దాడుల్లో 112 మంది డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5.8 కిలోల హెరాయిన్, భారీగా మత్తు మాత్రలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ‘యాంటీ గ్యాంగ్‌స్టర్’ ఆపరేషన్ విజయవంతంగా 77వ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాలను పూర్తిగా నిర్మూలించేవరకు ఈ చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. నేరగాళ్లకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తున్న వారిని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

Punjab Gangster Crackdown | పంజాబ్‌ గ్యాంగ్‌స్టర్లలో భయం

వరుస దాడులతో పంజాబ్‌ (Punjab)లో గ్యాంగ్‌స్టర్లలో భయం నెలకొంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, యువతను తప్పుదారి పట్టిస్తున్న గ్యాంగ్‌స్టర్ సంస్కృతికి చెక్ పెట్టడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. వరుసగా 77 రోజుల పాటు కొనసాగుతున్న ఈ భారీ ఆపరేషన్ పంజాబ్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచే చర్యగా మారింది. పోలీసుల ఈ దూకుడుతో నేరగాళ్లకు ఎక్కడా ఆశ్రయం దొరకకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ఇది కూడా చదవండి..: Flights Parking Fee | విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట.. భారీగా పార్కింగ్​ ఛార్జీల తగ్గింపు

Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
Toll Rules Change | ఏప్రిల్ 10 నుంచి టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు.. నగదు రద్దు, కొత్త విధానం అమలు
Car Fell Into Well | బావిలోకి దూసుకెళ్లిన కారు.. 9 మంది జల సమాధి
LPG cylinder supply | ఎల్​పీజీపై కేంద్రం కీలక ప్రకటన.. రాష్ట్రాలకు అదనంగా సిలిండర్లు
India Post GDS Results | పోస్టల్​ జాబ్స్​ ఫలితాలు విడుదల
TAGGED:Aam Aadmi Party GovernmentAnti-Gangster Task ForceCM Bhagwant MannPunjabPunjab Gangster Crackdown
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 09 Gold Rates April 09 Gold Rates | ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల ప్రభావం.. ఎగసిపడుతున్న బంగారం, వెండి ధరలు!
Next Article Hyderabad Fire Accident Hyderabad Fire Accident | హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?