అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Fire Accident | హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల (Jeedimetla)లోని ఓ పరిశ్రమ గోదాంలో గురువారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
జీడిమెట్లలోని పారిశ్రామిక వాడలో ఉన్న నిలువ ఉంచిన వేస్ట్ కెమికల్ గోదాం (Waste Chemical Warehouse)లో మంటలు అంటుకున్నాయి. గోదాంలో రసాయనాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
Hyderabad Fire Accident | భారీగా ఆస్తి నష్టం
అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పి వేస్తున్నారు. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు ఉన్నాయి. గతంలో సైతం ఇక్కడ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో ఫైర్ యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఆయా పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు (Fire Safety Regulations) పాటించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: HYDRAA Demolition | రోడ్డుకు అడ్డంగా నిర్మాణం.. కూల్చివేసిన హైడ్రా
