అక్షరటుడే, వెబ్‌డెస్క్: Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేరళం, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి. అలాగే పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు సైతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
ఆయా రాష్ట్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. కేరళంలోని 140 అసెంబ్లీ స్థానాలకు 30,471 పోలింగ్ కేంద్రాలు, అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు 31,486 పోలింగ్ కేంద్రాలు, పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు 1,009 పోలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. మూడు రాష్ట్రాల్లో కలిపి 6.1 కోట్లకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Assembly Elections Polling | బారులు తీరిన ఓటర్లు
ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కేరళం (Kerala)లో ఉదయం 9 గంటల వరకు 16.23 శాతం ఓటింగ్ నమోదు అయింది. అస్సాంలో 17.87 శాతం, పుదుచ్చేరిలో 17.41 శాతం పోలింగ్ అయిది. కర్నాటకలో బాగల్కోట్, దావణగెరె సౌత్ ఉప ఎన్నిక జరుగుతోంది. నాగాలాండ్ కోరిడాంగ్, త్రిపుర ధర్మనగర్ సైతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Assembly Elections Polling | ఓటు వేసిన సీఎం
కేరళం సీఎం పినరయి విజయన్ (Kerala CM Pinarayi Vijayan) ఓటు హక్కు వినియోగించున్నారు. రాష్ట్రంలో మళ్లీ తామే విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరువనంతపురం (Thiruvananthapuram)లో మలయాళం స్టార్ నటుడు మోహన్ లాల్ ఓటు వేశారు. కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపి త్రిశూర్‌లోని గురువాయుర్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇది కూడా చదవండి..: Punjab Gangster Crackdown | గ్యాంగ్‌స్టర్లపై భారీ దాడులు.. ఒక్కరోజే 202 అరెస్టులు, జోరుగా ‘యాంటీ గ్యాంగ్‌స్టర్’ ఆపరేషన్
