Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Volatility | పశ్చిమాసియాలో ఆగని ఉద్రిక్తతలు.. తీవ్ర ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Volatility | పశ్చిమాసియాలో ఆగని ఉద్రిక్తతలు.. తీవ్ర ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు

బిజినెస్​

Stock Market Volatility | పశ్చిమాసియాలో ఆగని ఉద్రిక్తతలు.. తీవ్ర ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. మధ్యాహ్నం 12.13 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 462 పాయింట్లు, నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 9, 2026 12:21 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 గంటలు ago
Share
Stock Market Volatility

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Volatility | పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురవుతుండడంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు చేస్తుండడంతో ఇరాన్ తిరిగి హార్మూజ్‌ను మూసి వేస్తున్నట్లు ప్రకటించింది.

Contents
  • Stock Market Volatility | నష్టాలతో ప్రారంభమై..
    • Stock Market Volatility | క్యాపిటల్ గూడ్స్, మెటల్ సెక్టార్లలో ర్యాలీ..

దీంతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర పెరుగుతోంది. ఇన్వెస్టర్లు పరిస్థితులను అంచనా వేస్తూ ఆచితూచి వ్యవహరిస్తుండడంతో ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.

Stock Market Volatility | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 243 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా పుంజుకుని 110 పాయింట్లు ఎగబాకింది. అక్కడినుంచి అమ్మకాల ఒత్తిడితో 805 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 81 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద లాభాల స్వీకరణతో 231 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం 12.13 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 462 పాయింట్ల నష్టంతో 77,100 వద్ద, నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో 23,907 వద్ద ఉన్నాయి.

Stock Market Volatility | క్యాపిటల్ గూడ్స్, మెటల్ సెక్టార్లలో ర్యాలీ..

క్యాపిటల్ గూడ్స్, పవర్, మెటల్ సెక్టార్లలో ర్యాలీ కొనసాగుతుండగా.. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండెక్స్‌లు ఒత్తిడికి గురవుతున్నాయి. నిఫ్టీ (Nifty)లో క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.76 శాతం, పవర్ 1.33 శాతం, మెటల్ 1.19 శాతం, యుటిలిటీ 0.92 శాతం, ఫార్మా 0.88 శాతం లాభాలతో, బ్యాంక్ నిఫ్టీ 0.85 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.67 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.41 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.30 శాతం, ఐటీ 0.31 శాతం నష్టాలతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 10 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 20 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎన్టీపీసీ 2.35 శాతం, బీఈఎల్ 2.19 శాతం, టీసీఎస్ 1.21 శాతం, పవర్‌గ్రిడ్ 1.07 శాతం, మారుతి 0.99 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఇండిగో 1.85 శాతం, ఎల్‌టీ 1.83 శాతం, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 1.56 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.40 శాతం, ఇన్ఫోసిస్ 1.40 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: April 09 Gold Rates | ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల ప్రభావం.. ఎగసిపడుతున్న బంగారం, వెండి ధరలు!

March 09 Gold Silver Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
Realme P4 Lite 5G | సరికొత్త రియల్‌మీ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Gift Nifty Gapdown | మార్కెట్‌లో యుద్ధభయాలు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ
Gold Rates March 20 | గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర!
Oppo K14 5G | భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి మరో ఫోన్.. మార్చి 9న లాంచ్ కానున్న కే14 మోడల్
TAGGED:Crude Oilcrude oil price impactDomestic Stock Marketglobal market trendsindia stock market newsNiftynifty updatesSensex Nifty fallShare market todayStock Market VolatilityWest Asia tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Cyber Scam  Cyber Scam | ఎమ్మెల్యేకు సైబర్​ నేరగాళ్ల టోకరా..
Next Article Shamshabad Rolex Seizure Shamshabad Rolex Seizure | శంషాబాద్​ ఎయిర్​పోర్టులో భారీగా రోలెక్స్​ వాచీలు పట్టివేత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?