అక్షరటుడే, వెబ్డెస్క్ : Shamshabad Rolex Seizure | హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport)లో రోలెక్స్ వాచీలు కలకలం రేపాయి. ముంబైకి వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి సుమారు రూ.18 కోట్ల విలువైన 30 విలాసవంతమైన రోలెక్స్ వాచీలను ఆర్‌జీఐఏ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Shamshabad Rolex Seizure | స్కానింగ్ సమయంలో
ఈ వాచ్‌లను హైదరాబాద్ (Hyderabad) నుంచి ముంబై (Mumbai)కి తరలిస్తుండగా స్కానింగ్ సమయంలో అధికారులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ప్యాకేజీలను తనిఖీ చేయగా ఖరీదైన వాచీలు బయటపడ్డాయి. దీంతో అధికారులు ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వాటిని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలు ఆరా తీశారు. విచారణ జరిపిన అనంతరం, అన్ని పన్ను చెల్లింపులు, చట్టపరమైన పత్రాలు నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. దీంతో కేసును మూసి వేసి ఇద్దరు ప్రయాణికులను విడుదల చేశారు. అయితే పెద్ద మొత్తంలో ఖరీదైన రోలెక్స్ వాచీలు (Rolex Watches) బయట పడటం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇది కూడా చదవండి..: Cyber Scam | ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల టోకరా..
