Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mavigun Flexi | తాడేపల్లిలో జ‌గ‌న్ ఇంటి ముందు ‘మావిగన్’ ఫ్లెక్సీ కలకలం.. ఇది దేనికి సంకేతం?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Mavigun Flexi | తాడేపల్లిలో జ‌గ‌న్ ఇంటి ముందు ‘మావిగన్’ ఫ్లెక్సీ కలకలం.. ఇది దేనికి సంకేతం?

ఆంధ్రప్రదేశ్​

Mavigun Flexi | తాడేపల్లిలో జ‌గ‌న్ ఇంటి ముందు ‘మావిగన్’ ఫ్లెక్సీ కలకలం.. ఇది దేనికి సంకేతం?

మావిగన్ కారిడార్‌ను రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు మద్దతుగా తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 9, 2026 1:24 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Mavigun Flexi

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mavigun Flexi | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి రాజధాని అంశం హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) నివాసం ఉన్న తాడేపల్లిలో ‘మావిగన్’ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

Contents
  • Mavigun Flexi | మావిగ‌న్ ఫ్లెక్సీ..
    •  Mavigun Flexi | రాజకీయాల్లో  మరోసారి రాజధాని చర్చ

మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు (MAVIGUN) ప్రాంతాలను కలిపే కారిడార్‌ను అభివృద్ధి చేసి రాజధానిగా తీర్చిదిద్దాలన్న ఆలోచనను ‘మావిగన్’గా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనకు మద్దతుగా వైసీపీ వర్గాలు ముందుకు వస్తున్నాయి. అయితే తాజాగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆసక్తికర నినాదాలను పొందుపరిచారు. ముఖ్యంగా “జగన్ 2.0 – మావిగన్ 2029” అనే స్లోగన్ ద్వారా రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ ప్రతిపాదనను ప్రధాన అజెండాగా తీసుకెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Mavigun Flexi | మావిగ‌న్ ఫ్లెక్సీ..

“యువతకు ఆదర్శం.. సమాజానికి అండ మావిగన్”, “ఒక పార్టీ.. ఒక జెండా.. ఒక అజెండా” వంటి నినాదాలు పార్టీ కేడర్‌ను ఏకం చేసేలా రూపొందించారు. ప్రస్తుతం అమరావతి రాజధాని అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిన సమయంలో, జగన్ నివాసం వద్ద ఇలాంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది అమరావతి (Amaravathi) రాజధాని నమూనాకు వైసీపీ పూర్తిగా వ్యతిరేకమనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 Mavigun Flexi | రాజకీయాల్లో  మరోసారి రాజధాని చర్చ

“జగన్ 2.0 – మావిగన్ 2029” నినాదం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా మార్చే ప్రయత్నం జరుగుతోందని స్పష్టమవుతోంది. రాజధాని అంశంపై కొత్త చర్చను ప్రారంభించి, ప్రజల్లో మద్దతు సంపాదించాలనే వ్యూహంగా ఇది కనిపిస్తోంది. మొత్తానికి, తాడేపల్లి (Tadepalli)లో వెలిసిన ఈ ‘మావిగన్’ ఫ్లెక్సీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  మరోసారి రాజధాని చర్చను రగిలించింది. ఇది కేవలం ఫ్లెక్సీతో ముగుస్తుందా? లేక రాబోయే రోజుల్లో పెద్ద రాజకీయ అజెండాగా మారుతుందా? అన్నది చూడాలి. కాగా, గ‌త కొద్ది రోజులుగా ఏపీలో మావిగ‌న్ చుట్టూ రాజ‌కీయం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. మావిగ‌న్ అనే ప‌దం జ‌గ‌న్ నోటి నుండి ఎప్పుడైతే వ‌చ్చిందో అప్పుడు అత‌నిపై దారుణంగా ట్రోల్ కూడా చేశారు. కొంద‌రు మ‌ద్దతు ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Nallamala Forest Fire | మహానంది నల్లమలలో భారీ కార్చిచ్చు.. వన్యప్రాణుల మనుగడకు ముప్పు!

YS Jagan Corruption Allegations | రాష్ట్రంలో భారీగా అవినీతి : వైఎస్​ జగన్​
Amaravati Capital Gazette | ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు.. జూన్ 2, 2024 నుంచి అమలు
AR Constable Murder | ఏఆర్​ కానిస్టేబుల్​ దారుణ హత్య
Andhra Pradesh New Map | ఏపీ కొత్త మ్యాప్​ విడుదల
Shivaji Raja Father Death | సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత.. శోక‌సంద్రంలో కుటుంబ స‌భ్యులు
TAGGED:AmaravathiAmaravati IssueAndhra PradeshAndhra Pradesh politicsap elections 2029capital city debate apjagan mohan reddy newsTadepallithadepally newsY. S. Jagan Mohan Reddyysrcp strategy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Revanth Reddy Failure Revanth Reddy Failure | పాలనలో రేవంత్​రెడ్డి విఫలం : మాజీ మంత్రి జీవన్​రెడ్డి
Next Article Hindu Deity Disrespect Hindu Deity Disrespect | హిందూ దేవుళ్లను కించపరుస్తూ మహిళ పోస్టులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?