అక్షరటుడే, కమ్మర్పల్లి : Road Safety Awareness | రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఆర్మూర్ (Armoor) డివిజన్ పరిధిలోని సర్పంచ్‌లతో గురువారం సమావేశం నిర్వహించారు.
Road Safety Awareness | సర్పంచ్‌ల పాత్ర కీలకం..
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అతివేగం, నిద్రమత్తు, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. గ్రామ స్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగం వంటి ప్రమాదకర అలవాట్లను నియంత్రించేందుకు గ్రామ స్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సర్పంచ్‌లను కోరారు.
Road Safety Awareness | వీడియోల ద్వారా అవగాహన
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు కమ్మర్పల్లి ఎస్సై అనిల్‌రెడ్డి (Kammarpally SI Anil Reddy) ప్రత్యేకంగా ఒక అవగాహన వీడియోను రూపొందించగా సీపీ అభినందించారు. ఈ వీడియోకు ఎస్సై స్వయంగా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, రోడ్డు ప్రమాదాల కారణాలు, నివారణ చర్యలను స్పష్టంగా వివరించారు. సమావేశంలో సర్పంచ్‌లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ల పట్టివేత..
