అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) కౌంటర్ ఇచ్చారు. రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో ఆయనపై ఆరోపణలు చేశారు.
పొంగులేటి (Ponguleti) బుధవారం హరీశ్‌రావుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అక్రమ మైనింగ్‌కు రాఘవ కన్స్ట్రక్షన్తో సంబంధం లేదన్నారు. దీనిపై తాజాగా హరీశ్‌రావు స్పందించారు. ఆయన గురువారం వనపర్తిలో మీడియాతో మాట్లాడారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అధినేతలా పొంగులేటి మాట్లాడారన్నారు. సహచర మంత్రుల అవినీతిని అంగీకరించారని ఆరోపించారు. ఆయన పొంగులేటి కాదని పొంగు’లూటీ’ అని అన్నారు.
Harish Rao | అనేక అక్రమాలు
రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సభలో చెప్పారన్నారు. మైనింగ్ శాఖ మంత్రి సైతం దానికి అనుమతులు లేవన్నారని గుర్తు చేశారు. నాలుగు శాఖలు విచారణ జరిపి నివేదిక ఇచ్చాయన్నారు. నోటీసులు ఇచ్చినా పొంగులేటి సంబంధం లేదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఆ రోజు సభలో ఎందుకు చెప్పాలేదన్నారు. మంత్రి పొంగులేటి అనేక అక్రమాలు చేశారని, వాటిని బయట పెడతామన్నారు. శిల్ప, ఏక్యూ సంస్థల్లో పొంగులేటి కుమారుడికి వాటా లేదా అని ప్రశ్నించారు.
Harish Rao | హైడ్రా ఎక్కడ
నాదర్‌గూల్‌లో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే హైడ్రా ఏం చేస్తోందన్నారు. అవి ప్రభుత్వ భూములని మంత్రి చెప్పారని, మరి బౌన్సర్లతో కాపలా ఎందున్నారు. 2016లో నాదర్‌గుల్ భూములను నిషేధితా జాబితాలో పెట్టినట్లు తెలిపారు. అది ప్రభుత్వ భూమి అంటున్న పొంగులేటి.. ఎందుకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం లేదో చెప్పాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. అక్రమాలు బయట పడటంతో పొంగులేటి అసహనంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : Revanth Reddy Failure | పాలనలో రేవంత్‌రెడ్డి విఫలం : మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
