అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Heatwave | రాష్ట్రంలో ఎండలు మండనున్నాయి. ఈ నెల 12 నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత (Temperature)లు నమోదు అవుతాయని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ వేసవి ప్రారంభం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. అకాల వర్షాలు కురిసిన సమయంలో కాస్త చల్లబడ్డ భానుడు.. మిగతా సమయాల్లో తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
Telangana Heatwave | పది రోజుల పాటు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 12 నుంచి 22 వరకు హీట్‌వేవ్ ప్రభావం ఉండనుంది. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వనపర్తి, గద్వాల్, ఉమ్మడి ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ (Hyderabad)లో 40–41 డిగ్రీల మధ్య ఎండలు ఉండనున్నాయి. అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉంది. ఈ పది రోజుల పాటు వేడి గాలులు వీస్తాయి. ప్రజలు అప్రమత్తతంగా ఉండాలని అధికారులు సూచించారు.
Telangana Heatwave | నీరు తాగాలి
ఎండలు మండుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. నీరు ఎక్కువగా తాగాలి. మధ్యాహ్నం సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఎండలో ఎక్కువ సేపు ఉండొద్దు. ఎండలో వెళ్లాల్సి వస్తే తలకు టోపి, రుమాల్, స్కార్ఫ్ వంటివి ధరించాలి. బయటకు వెళ్తున్న సమయంలో వెంట నీరు తీసుకెళ్లాలి. తెలంగాణ ప్రభుత్వం సైతం హీట్ వేవ్ నేపథ్యంలో అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
HEATWAVE WARNING – APRIL 12-22 ⚠️🔥
Dear people of Telangana, get ready for a POWERFUL HEATWAVE from April 12 with entire Telangana will witness above 40°C heat
North, East TG in RED MARKED districts will be under SERIOUS HEAT with temperatures to cross 44°C at few parts… pic.twitter.com/sqONvwNlYD
— Telangana Weatherman (@balaji25_t) April 9, 2026
ఇది కూడా చదవండి : Cyber Scam | ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల టోకరా..
