అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Fall | లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగిస్తే అమెరికాతో చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్ హెచ్చరించడంతో పశ్చిమాసియాలో అనిశ్చితి నెలకొంది.
అమెరికా -ఇరాన్ మధ్య శాశ్వత కాల్పుల విరమణపై ఆశలు సన్నగిల్లుతుండడం, క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు పెరుగుతుండడంతో పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. ప్రధాన గ్లోబల్ మార్కెట్లు సైతం ఎరుపెక్కాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఐదు వరుస సెషన్ల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్‌లో లాభాలకు బ్రేక్ పడింది. ప్రధాన ఈక్విటీ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ గురువారం నష్టాలతో ముగిశాయి.
Stock Market Fall | నష్టాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 243 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా పుంజుకుని 110 పాయింట్లు ఎగబాకింది. అక్కడినుంచి అమ్మకాల ఒత్తిడితో 1,082 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 81 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద లాభాల స్వీకరణతో 308 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 931 పాయింట్ల లాభంతో 76,631 వద్ద, నిఫ్టీ 222 పాయింట్ల లాభంతో 23,775 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Fall | రాణించిన క్యాపిటల్ గూడ్స్, మెటల్ సెక్టార్లు..
క్యాపిటల్ గూడ్స్, పవర్, మెటల్ సెక్టార్లు రాణించగా.. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండెక్స్‌లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ (Nifty)లో క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.64 శాతం, పవర్ 1.27 శాతం, మెటల్ 1.25 శాతం, యుటిలిటీ 0.69 శాతం, ఫార్మా 0.66 శాతం లాభపడగా.. బ్యాంక్ నిఫ్టీ 1.58 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.41 శాతం, మీడియా 0.39 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.53 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.39 శాతం, ఆటో 0.39 శాతం నష్టపోయాయి.
Stock Market Fall | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,150 కంపెనీలు లాభపడగా 2,137 స్టాక్స్ నష్టపోయాయి. 133 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 109 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 28 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 9 కంపెనీలు లాభాలతో, 21 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బీఈఎల్ 1.57 శాతం, పవర్‌గ్రిడ్ 1.12 శాతం, ఎన్టీపీసీ 1.12 శాతం, టీసీఎస్ 1.09 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.60 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఇండిగో 3.64 శాతం, ఎల్‌టీ 2.75 శాతం, ఎటర్నల్ 2.34 శాతం, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 2.31 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.18 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: OnePlus Nord 6 | అత్యాధునిక ఫీచర్లతో వన్‌ప్లస్ ఫోన్
