Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: NSUI Foundation Day | కాంగ్రెస్​ పార్టీలో వ్యక్తిగత ఎజెండాలకు తావులేదు : నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - NSUI Foundation Day | కాంగ్రెస్​ పార్టీలో వ్యక్తిగత ఎజెండాలకు తావులేదు : నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

నిజామాబాద్

NSUI Foundation Day | కాంగ్రెస్​ పార్టీలో వ్యక్తిగత ఎజెండాలకు తావులేదు : నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

కాంగ్రెస్​ పార్టీలో వ్యక్తిగత ఎజెండాలకు తావులేదని నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ఎన్​ఎస్​యూఐ ఫౌండేషన్​ డే సందర్భంగా నగరంలోని కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. 

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 9, 2026 5:56 సా.
Shashi kiran Mottala
10 గంటలు ago
Share
NSUI Foundation Day |
NSUI Foundation Day | కాంగ్రెస్​ పార్టీలో వ్యక్తిగత ఎజెండాలకు తావులేదు : నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: NSUI Foundation Day | కాంగ్రెస్​ పార్టీలో (Nizamabad Congress) వ్యక్తిగత ఎజెండాలకు తావులేదని నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) అన్నారు. ఎన్​ఎస్​యూఐ (NSUI) ఫౌండేషన్​ డే సందర్భంగా నగరంలోని కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో జెండా (Congress Party Agenda) ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

Contents
  • NSUI Foundation Day | డీఎస్​, బొమ్మ మహేశ్​.. ఎన్​ఎస్​యూఐ నుంచి వచ్చినవారే..
    • NSUI Foundation Day | ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ లేదు..

NSUI Foundation Day | డీఎస్​, బొమ్మ మహేశ్​.. ఎన్​ఎస్​యూఐ నుంచి వచ్చినవారే..

ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. 1971లో కేరళ స్టూడెంట్స్ యూనియన్, పశ్చిమ్ బెంగాల్ స్టేట్ ఛాత్ర పరిషత్​లను విలీనం చేసి ఒక జాతీయ విద్యార్ధి సంస్థను ఏర్పాటు చేశారన్నారు. 1971 ఏప్రిల్ 9వ తేదీన ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో వాటిని కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలుగా విలీనం చేసుకుని నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియాగా ఆవిర్భవించిందన్నారు. జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ తన రాజకీయాన్ని ఎన్​ఎస్​యూఐ విభాగం నుంచే ప్రారంభించి నేడు పీసీసీ చీఫ్​గా (PCC Chief Bomma) ఎదిగారని గుర్తు చేశారు. అదేవిధంగా జిల్లాలో డి శ్రీనివాస్ (D Srinivas) సైతం ఎన్​ఎస్​యూఐ నాయకుడి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి వరకు తన ప్రస్థానం కొనసాగించారన్నారు.

NSUI Foundation Day | ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ లేదు..

ఎన్​ఎస్​యూఐ, యూత్​ కాంగ్రెస్​లు (Youth Congress) రెండు కాంగ్రెస్​ పార్టీకి అనుబంధ విభాగాలని బొబ్బిలి రామకృష్ణ అన్నారు. వీటికి ప్రత్యేక ఎజెండాకు ఏమీ ఉండదని వ్యక్తిగత ఎజెండా కూడా ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాలను నియమాలను రెండు విభాగాలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో ఎవరైనా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని వ్యక్తిగత ఏజెండాలు పెట్టుకొని పని చేయకూడదని స్పష్టం చేశారు. పార్టీ ఇచ్చే ఆదేశాలను నియమాలను పాటిస్తూ పార్టీ అభివృద్ధికి దోహద పడాలని సూచించారు. త్వరలోనే జిల్లా ఎన్​ఎస్​యూఐ కమిటీని ఎన్నికల ద్వారా గాని ఇంటర్వ్యూ ద్వారా నియమిస్తామన్నారు.

ఎవరైనా పార్టీ నియమాలను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని రామకృష్ణ అన్నారు. అలాగే ఎన్​ఎస్​యూఐ జిల్లా మాజీ అధ్యక్షులు శరత్, జీవీ రామకృష్ణ , రాంభూపాల్, గన్ రాజ్, విపుల్ గౌడ్ తదితరులు ఎన్​ఎస్​యూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు శరత్ కుమార్, సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జండా గుడి ఛైర్మన్ ప్రమోద్, నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ కోశాధికారి శివకుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు దత్తు, కృపాల్​సింగ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Telangana Political News | మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లాలనుకోవడం తప్పుడు నిర్ణయం: ఎంపీ అర్వింద్​

Makloor Society Protest | మాక్లూర్​ సొసైటీలో అక్రమాలపై సభ్యుల ఆందోళన
Petrol Shortage | పెట్రోల్ కొరతపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: ఎస్పీ రాజేష్​ చంద్ర
Ram Navami Rally Rules | సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి: సీపీ
Municipal Workers Protest | అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులపై చర్చ జరగాలి
ASHA Workers Protest | కామారెడ్డిలో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం
TAGGED:Bobbili RamakrishnaCongress Party AgendaD SrinivasIndian National Congressnizamabad congress newsNSUI IndiaPCC Chief BommaTelangana political newsYouth Congress India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article KTR Jeevan Reddy KTR Jeevan Reddy | కేసీఆర్, జీవన్ రెడ్డిల అనుబంధం ఇప్పటిది కాదు..: కేటీఆర్​
Next Article HIV Awareness | HIV Awareness | హెచ్​ఐవీపై అవగాహన అవసరం: జిల్లా అదనపు కలెక్టర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?