అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR Jeevan Reddy | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జగిత్యాలకు వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారు.
KTR Jeevan Reddy | సుదీర్ఘ అనుభవం ఉన్న నేత
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జీవన్‌రెడ్డి (Jeevan Reddy) సుదీర్ఘ అనుభవం ఉన్న నేత అని పేర్కొన్నారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించామని తెలిపారు. ఆయన రాజకీయ అనుభవం, ప్రజా జీవితంలో ముడిపడి ఉన్న బంధం సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ (Congress)తోనే సాగిందన్నారు. ఆ పార్టీకి ఆయన నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించారని గుర్తు చేశారు.
KTR Jeevan Reddy | నాడు పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు..
తెలంగాణ (Telangana) ఏర్పడిన అనంతరం జీవన్‌రెడ్డిని తమ పార్టీలోకి రావాలని కేసీఆర్ (KCR) ఆహ్వానించారని కేటీఆర్ గుర్తు చేశారు. విశేషమైన అనుభవం ఉన్న నాయకులు ఉండే బాగుంటుందని కేసీఆర్ భావించారన్నారు. కానీ ఆయన కాంగ్రెస్‌ను వీడి రాలేదన్నారు. కేసీఆర్, జీవన్ రెడ్డిల అనుబంధం ఇప్పటిది కాదని వ్యాఖ్యానించారు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి.. ఇద్దరి మధ్య పరిచయం, స్నేహం, పరస్పర గౌరవం ఉందని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Telangana Political News | మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లాలనుకోవడం తప్పుడు నిర్ణయం: ఎంపీ అర్వింద్
