అక్షరటుడే, ఆర్మూర్: Plastic Ban Village | అలూర్ (Alur) మండలం మచ్చర్ల వీడీసీ (Macharla VDC) , జీపీ ఆధ్వర్యంలో ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ (Plastic Pollution Control) తీర్మానం చేశారు. సర్పంచ్ కట్ట మల్లవ్వ నర్సయ్య ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Plastic Ban Village | కిరాణా దుకాణాలు.. హోటళ్లు, బేకరీలు..
గ్రామంలో ఉన్న కిరాణా దుకాణాలు, దుస్తుల షాప్లు, హోటళ్లు, బేకరీలు, మెడికల్ షాపులు, అంగడి బజార్లలో ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. హోటళ్లలో ప్లాస్టిక్ గ్లాసుల బదులుగా స్టీల్ గ్లాసులు ఉపయోగించాలని సూచించారు. అదేవిధంగా యువతకు సిగరెట్లు, మత్తు పానీయాలు, పాన్, గుట్కా వంటి హానికర పదార్థాల విక్రయాన్ని కూడా నిషేధిస్తూ గ్రామస్థులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.
Plastic Ban Village | నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు..
ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.5,000 జరిమానా విధిస్తామని గ్రామ పంచాయతీ సభ్యులు హెచ్చరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆధ్వర్యంలో మహిళా సంఘ సభ్యులకు 500 ప్లేట్లు, 200 స్టీల్ గ్లాసులు పంపిణీ చేయగా, హోటళ్లకు 100 స్టీల్ గ్లాసులు ప్రతి ఇంటికి రెండు చొప్పున బ్యాగులు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కట్ట నర్సయ్య, మహేందర్, పోశన్న, గంగారెడ్డి, శ్రీనివాస్, లింగమయ్య, భూమన్న, జగదీష్, గంగారాం, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: KTR Jeevan Reddy | కేసీఆర్, జీవన్ రెడ్డిల అనుబంధం ఇప్పటిది కాదు..: కేటీఆర్
