అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CCTV Cameras Safety | ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని (Armoor) జర్నలిస్ట్ కాలనీలో (Journalist Colony) భక్త ఆంజనేయ మందిరంలో 22 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా.. సీపీ వాటిని ప్రారంభించారు.
CCTV Cameras Safety | ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం..
పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. కాలనీలో కలిసికట్టుగా ఉండి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం బాగుందన్నారు. పట్టణంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం సీసీ కెమెరాలతోనే ఉంటుందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు.
CCTV Cameras Safety | ట్రాఫిక్ నియంత్రణలోనూ..
అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ (Nizamabad Police) చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ (Community Policing) కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ, కౌన్సిలర్ విజయ్ అగర్వాల్ (దియా), జర్నలిస్ట్ కాలనీ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్, సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ నిపుణుడు ప్రవీణ్ చారి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
