Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bhagavad Gita Record | భగవద్గీత పఠనంలో ‘ఎలైట్ వరల్డ్ రికార్డ్’ సాధించిన అన్నదమ్ములు.. అభినందించిన ఎస్పీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Bhagavad Gita Record | భగవద్గీత పఠనంలో ‘ఎలైట్ వరల్డ్ రికార్డ్’ సాధించిన అన్నదమ్ములు.. అభినందించిన ఎస్పీ

నిజామాబాద్

Bhagavad Gita Record | భగవద్గీత పఠనంలో ‘ఎలైట్ వరల్డ్ రికార్డ్’ సాధించిన అన్నదమ్ములు.. అభినందించిన ఎస్పీ

భగవద్గీత పఠనంలో భిక్కనూరుకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు అద్భుత ప్రతిభ చూపారు. అరుదైన 'ఎలైట్ వరల్డ్ రికార్డ్' సాధించారు. ఈ సందర్భంగా వారిని గురువారం ఎస్పీ రాజేష్​ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 9, 2026 9:40 సా.
Shashi kiran Mottala
11 గంటలు ago
Share
Bhagavad Gita Record |
Bhagavad Gita Record | భగవద్గీత పఠనంలో 'ఎలైట్ వరల్డ్ రికార్డ్' సాధించిన అన్నదమ్ములు.. అభినందించిన ఎస్పీ రాజేష్​ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి: Bhagavad Gita Record | భగవద్గీత పఠనంలో భిక్కనూరుకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు అద్భుత ప్రతిభ చూపారు. అరుదైన ‘ఎలైట్ వరల్డ్ రికార్డ్’ (Elite World Record India) సాధించారు. ఈ సందర్భంగా వారిని గురువారం ఎస్పీ రాజేష్​ చంద్ర (SP rajesh Chandra) ప్రత్యేకంగా అభినందించారు.

Contents
  • Bhagavad Gita Record | భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు కుమారులు..
    • Bhagavad Gita Record | చిన్నారుల ప్రతిభను చూసి అబ్బురపడిన ఎస్పీ..
      • Bhagavad Gita Record | దేశవ్యాప్తంగా ప్రశంసలు..

Bhagavad Gita Record | భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు కుమారులు..

భిక్కనూరు (Bhiknoor) ఎస్సై ఆంజనేయులు కుమారులు కుశాల్ మనోహర్ యాదవ్, కార్తీక్ మనోహర్ యాదవ్ ఆధ్యాత్మిక రంగంలో అద్భుత ప్రతిభ చూపుతున్నారు. గత రెండేళ్లుగా ‘గీతా పరివార్’ (Gita Parivar) నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతుల ద్వారా శిక్షణ పొందుతూ.. భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో ఉన్న 700 శ్లోకాలను అనర్గళంగా కంఠతా నేర్చుకున్నారు. వీరి అకుంఠిత దీక్షకు గుర్తింపుగా గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా, ప్రతిష్టాత్మకమైన ‘గీతావ్రతి’గా గుర్తింపు పొందారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన ‘జ్ఞానస్మృతి’ కార్యక్రమంలో తమ ప్రతిభను చాటి ‘ఎలైట్​ వరల్డ్​ రికార్డ్​’ సర్టిఫికెట్లు సాధించారు.

Bhagavad Gita Record | చిన్నారుల ప్రతిభను చూసి అబ్బురపడిన ఎస్పీ..

చిన్నారులు సాధించిన ఈ అరుదైన విజయాలను తెలుసుకున్న ఎస్పీ రాజేష్ చంద్ర అబ్బురపడ్డారు. వారిని జిల్లా పోలీస్ కార్యాలయానికి (Kamareddy News) పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఎస్పీ సమక్షంలో భగవద్గీత శ్లోకాలను స్పష్టంగా పఠించారు. చిన్నారులు పఠించిన శ్లోకాలను శ్రద్ధగా విన్న ఎస్పీ వాటి అర్థాలను అడిగి తెలుసుకోగా.. పిల్లలు ఆ శ్లోకాల అంతరార్థాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. చిన్నారుల ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని చూసి ఎస్పీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వారిని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. అనంతరం ఆయన చిన్నారులకు స్వీట్లు తినిపించి, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశీస్సులు అందజేశారు. చిన్న వయసులోనే ఇలాంటి ఉత్తమ మార్గంలో నడిపిస్తున్న తల్లిదండ్రులను అభినందిస్తూ, భవిష్యత్తులో ఈ చిన్నారులు ఉన్నత స్థాయికి ఎదిగి కన్నతల్లిదండ్రుల పేరుతో పాటు కామారెడ్డి జిల్లా పేరును కూడా దశదిశలా చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె నరసింహా రెడ్డి, భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.

Bhagavad Gita Record | దేశవ్యాప్తంగా ప్రశంసలు..

చిన్నారులు దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. గత ఏడాది జూన్​లో శృంగేరి శారదా పీఠంలో (Sringeri Sharada Peetam) నిర్వహించిన గీతా జ్ఞాన యజ్ఞంలో పాల్గొని, జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారి ఆశీస్సులు, ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఇటీవల హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్వహించిన “సహస్ర గీతాపఠన” కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి వచ్చిన గీతా పాఠకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు బాబా రాందేవ్ (Baba Ramdev), అయోధ్య రామాలయ ట్రస్ట్ (Ayodhya Ram Temple Trust)​ కోశాధికారి గురు గోవింద్ గిరి చేతుల మీదుగా ప్రశంసలు అందుకొని జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టారు.

ఇది కూడా చదవండి: KTR Jeevan Reddy | కేసీఆర్, జీవన్ రెడ్డిల అనుబంధం ఇప్పటిది కాదు..: కేటీఆర్​

BRS Leaders Arrest | బీఆర్ఎస్, బీఆర్​ఎస్​వీ నాయకుల ముందస్తు అరెస్ట్
NSUI Foundation Day | కాంగ్రెస్​ పార్టీలో వ్యక్తిగత ఎజెండాలకు తావులేదు : నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
Yellareddy Police | జీవితంపై విరక్తితో ఒకరి బలవన్మరణం
Threat Case Jail | బెదిరింపుల కేసులో ఒకరికి మూడేళ్ల జైలు..
Indiramma Houses Scheme | పేదోడి సొంతింటి కలను నెరవేరుస్తున్న రేవంత్ రెడ్డి..: మానాల మోహన్​రెడ్డి
TAGGED:Ayodhya Ram Temple TrustBaba RamdevBhikkanoorGita ParivarInspirational Stories IndiaKamareddy NewsSP Rajesh ChandraSpiritual Achievements IndiaSringeri Sharada Peetam
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Drug Seizure Drug Seizure | శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో భారీగా గంజాయి పట్టివేత
Next Article ACB Bribery Case ACB Bribery Case | ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్​ రేంజ్​ ఆఫీసర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?