అక్షరటుడే,హైదరాబాద్: Mumbai Airport Fire | ముంబయిలోని Chhatrapati Shivaji Maharaj International Airport లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టర్మినల్–1బిలో గురువారం (ఏప్రిల్ 09) ఒక్కసారిగా అగ్ని కీలలు వ్యాపించాయి. కేబుల్ ట్రేలు, స్విచ్ బాక్సుల్లో సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
Mumbai Airport Fire | కమ్ముకున్న పొగ..
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతి తక్కువ సమయంలోనే మంటలను అదుపులోకి తెచ్చారు. టర్మినల్ గ్రౌండ్ ఫ్లోర్‌కే మంటలు పరిమితమైనట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగినప్పుడు విమానాశ్రయంలో ఘనంగా పొగ కమ్ముకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అగ్ని ప్రమాదం ఘటన చిన్నదని, మంటలు తక్షణమే అదుపులోకి వచ్చాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Electricity Bill Saving | సమ్మర్‌లో కరెంటు బిల్లు షాక్ ఇస్తోందా? ఈ సింపుల్ టిప్స్‌తో సగం బిల్లు ఆదా చేసుకోండిలా!
Fire at Mumbai airport @CSMIA_Official pic.twitter.com/KEq8KtgP4S
— Anand Prasad Ram (@prince7anand) April 9, 2026
