Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jananayagan Scenes Leaked | ‘జన నాయగన్’కు భారీ షాక్.. కీలక సన్నివేశాలు లీక్ , భ‌గ‌వంత్ కేస‌రీని దింపేశారుగా..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Jananayagan Scenes Leaked | ‘జన నాయగన్’కు భారీ షాక్.. కీలక సన్నివేశాలు లీక్ , భ‌గ‌వంత్ కేస‌రీని దింపేశారుగా..!

సినిమా

Jananayagan Scenes Leaked | ‘జన నాయగన్’కు భారీ షాక్.. కీలక సన్నివేశాలు లీక్ , భ‌గ‌వంత్ కేస‌రీని దింపేశారుగా..!

దళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రానికి పెద్ద దెబ్బ తగిలింది. ఐదు నిమిషాల సన్నివేశం, ఒక పాట లీక్ కావడంతో చిత్ర బృందం పోలీసులను ఆశ్రయించింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 9:59 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 గంటలు ago
Share
Jananayagan Scenes Leaked

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Jananayagan Scenes Leaked | ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ కు తన కొత్త సినిమా ‘జన నాయగన్’ (Jananayagan) విషయంలో ఊహించని షాక్ తగిలింది. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో (Social Media) లీక్ కావడం చిత్ర యూనిట్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

Contents
  • Jananayagan Scenes Leaked | వీడియోలు తొల‌గించే ప‌నిలో పోలీసులు..
    • Jananayagan Scenes Leaked | సన్నివేశాల లీక్ కలకలం

సుమారు ఐదు నిమిషాల నిడివి గల సన్నివేశంతో పాటు, సినిమాలోని ఒక పాట కూడా ఇంటర్నెట్‌లోకి రావడంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అయింది. ఈ లీక్ కారణంగా సినిమా కథలోని ముఖ్యమైన భాగాలు బయటపడే ప్రమాదం ఉండడంతో, మేకర్స్ వెంటనే చర్యలు తీసుకున్నారు.

Jananayagan Scenes Leaked | వీడియోలు తొల‌గించే ప‌నిలో పోలీసులు..

ఈ ఘటనపై చిత్ర బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ లీక్ ఎలా జరిగింది? ఎవరు దీనికి కారణం? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో సైబర్ క్రైమ్ విభాగం (Cyber ​​Crime Division) లీక్ అయిన వీడియోలను తొలగించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు ఈ సినిమాకు ప్రారంభం నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా, కోర్టు కేసులు, సెన్సార్ సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడింది. దీంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది.

Jananayagan Scenes Leaked | సన్నివేశాల లీక్ కలకలం

ఇది విజయ్ (Vijay) కెరీర్‌లో చివరి సినిమా కావచ్చనే ప్రచారం నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ గత మూడు నెలలుగా వరుస వివాదాలు ఈ సినిమాను చుట్టుముట్టడం గమనార్హం. ఇప్పుడు సన్నివేశాల లీక్ ఘటన మరింత కలకలం రేపుతోంది. అయితే అన్ని అడ్డంకులను అధిగమించి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి పైరసీ సమస్యలు (Piracy Issues) రావడం చిత్ర యూనిట్‌కు తలనొప్పిగా మారింది. లీకైన స‌న్నివేశాలు చూసిన కొంద‌రు అచ్చు భ‌గ‌వంతి కేస‌రీని దింపేశార‌ని కామెంట్ చేస్తున్నారు. కాగా, జ‌న‌నాయ‌గ‌న్.. భ‌గ‌వంత్ కేస‌రి రీమేక్ అంటూ కొన్నాళ్ళుగా ప్రచారం జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే.

ఇది కూడా చదవండి..: Allu Arjun Raaka First Look | సగం మనిషి.. సగం మృగం.. “రాకా”గా షాక్ ఇచ్చిన అల్లు అర్జున్.. అట్లీ ప్లాన్ ఏంటి?

Vijay Rashmika Sangeeth Pics | సంగీత్ ఫొటోలతో ట్రెండింగ్‌లో విజయ్–రష్మిక.. ఏమ‌న్నా ఎంజాయ్ చేశారా..!
Movie Ticket Prices | కొత్త సినిమాలకు ఊరట… టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Hema Drug Test | డ్రగ్స్ కలకలం.. నెగెటివ్ వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేసిన నటి హేమ..
Allu Arjun Raaka First Look | సగం మనిషి.. సగం మృగం.. “రాకా”గా షాక్ ఇచ్చిన అల్లు అర్జున్.. అట్లీ ప్లాన్ ఏంటి?
Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు..
TAGGED:Cyber ​​Crime DivisionJananayaganJananayagan Scenes LeakedPiracy IssuesSocial MediaVijay
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 10 Gold Rates April 10 Gold Rates | బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో తాజా రేట్లు ఇవే
Next Article Mukul Chaudhary Innings Mukul Chaudhary Innings | ఐపీఎల్‌లో కొత్త సంచలనం ముకుల్ చౌదరి.. అద్భుత ఇన్నింగ్స్‌తో లక్నోకు విజయం, అభినందించిన‌ సంజీవ్ గోయెంకా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?