అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jeevan Reddy KCR Meeting | మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలవనున్నారు. జీవన్‌రెడ్డిని కేసీఆర్ లంచ్‌కు ఆహ్వానించారు. దీంతో ఎర్రవల్లి (Erravalli)లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో మాజీ మంత్రి భేటీ కానున్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్‌రెడ్డి త్వరలో బీఆర్ఎస్ (BRS)లో చేరనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్వయంగా జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి చేరాలని ఆహ్వానించారు. పలు అంశాలపై ఆయనతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించామని తెలిపారు. కేసీఆర్, జీవన్ రెడ్డిల అనుబంధం ఇప్పటిది కాదని వ్యాఖ్యానించారు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి.. ఇద్దరి మధ్య పరిచయం, స్నేహం, పరస్పర గౌరవం ఉందని చెప్పారు.
Jeevan Reddy KCR Meeting | ఈ నెల 27న..
కేటీఆర్‌తో భేటీ అనంతరం తాజాగా కేసీఆర్ (KCR) నుంచి జీవన్‌రెడ్డికి ఆహ్వానం రావడం గమనార్హం. ఈ క్రమంలో మధ్యాహ్నం జీవన్‌రెడ్డితో కేసీఆర్ లంచ్ చేయనున్నారు. పార్టీలో ఆయనకు మంచి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నెల 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ రోజు కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి (Jeevan Reddy) గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి..: ACB Bribery Case | ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
