Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ఎండకాలంలో మీ పెంపుడు కుక్కల జాగ్రత్తలు.. ‘సమ్మర్ డైట్ రీసెట్’ తప్పనిసరి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - ఎండకాలంలో మీ పెంపుడు కుక్కల జాగ్రత్తలు.. ‘సమ్మర్ డైట్ రీసెట్’ తప్పనిసరి

లైఫ్​స్టైల్​

ఎండకాలంలో మీ పెంపుడు కుక్కల జాగ్రత్తలు.. ‘సమ్మర్ డైట్ రీసెట్’ తప్పనిసరి

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 11:22 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
15 గంటలు ago
Share
dog 1

వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ పెంపుడు శునకాలు వడదెబ్బ, డీహైడ్రేషన్ కడుపు సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా కుక్కల ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ‘గోద్రెజ్ పెట్ కేర్’ పరిశోధన విభాగం అధిపతి డాక్టర్ అశోక్ పట్టనాయక్ సూచిస్తున్నారు. ఎండకాలంలో వాటిని ఆరోగ్యంగా ఉంచేందుకు ‘సమ్మర్ డైట్ రీసెట్’ విధానాన్ని అనుసరించాలని ఆయన కోరారు.

వేసవిలో జీర్ణక్రియే కీలకం

కుక్కల రోగనిరోధక శక్తిలో అధిక భాగం వాటి జీర్ణవ్యవస్థపైనే ఆధారపడి ఉంటుంది. వేడి వాతావరణం వల్ల ఆహారం త్వరగా కలుషితం కావడం, శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాలతో పెంపుడు జంతువులు అనారోగ్యానికి గురవుతాయి. ఒకవేళ మీ కుక్క సరిగ్గా ఆహారం తీసుకోకపోయినా, నీరసంగా ఉన్నా లేదా విరేచనాలతో బాధపడుతున్నా.. వెంటనే వాటి డైట్ మార్చాలని అర్థం చేసుకోవాలి. విపరీతంగా రొప్పుడం కూడా శరీరంలో నీటి శాతం తగ్గుతోందనడానికి ఒక సంకేతం.

మీ పెంపుడు జంతువు కోసం సమ్మర్ డైట్ చిట్కాలు

శునకాల జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు ఈ క్రింది మార్పులు చేయండి:

జల శక్తి: వాటి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉండేలా నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని అందించాలి. ఇది డీహైడ్రేషన్ బారి నుండి రక్షిస్తుంది.

తేలికపాటి ఆహారం: ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే భారీ భోజనం జీర్ణం కావడం కష్టం. అందువల్ల తక్కువ కొవ్వు, నాణ్యమైన ప్రోటీన్ ఫైబర్ ఉన్న ఆహారాన్ని తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు పెట్టడం ఉత్తమం.

పేగుల ఆరోగ్యం: 2 నుంచి 4 శాతం ఫైబర్ ప్రిబయోటిక్స్ ఉండే ఆహారం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

శాస్త్రీయ పోషణ: ఇంటి భోజనంలో అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు అందకపోవచ్చు. కాబట్టి భారతీయ వాతావరణానికి సరిపోయేలా తయారైన ‘గోద్రెజ్ నింజా’ వంటి సమతుల్య ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల వాటికి పూర్తి పోషణ అందుతుంది.

సరైన సమయంలో ఆహారం

వేసవిలో వాతావరణం చల్లగా ఉండే ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే శునకాలకు ఆహారం ఇవ్వాలి. మధ్యాహ్న సమయాల్లో ఆహారం కంటే తాజా నీటిని అందుబాటులో ఉంచడం ముఖ్యం. ఎండ ప్రభావంతో వాటి శారీరక శ్రమ తగ్గినప్పుడు, దానికి తగ్గట్టుగా ఆహార పరిమాణాన్ని కూడా నియంత్రించాలి. సరైన పోషణ జాగ్రత్తలతో మీ పెంపుడు జంతువులు ఈ వేసవిని హాయిగా గడిపేలా చేయవచ్చు.

Muskmelon | సమ్మర్ స్పెషల్ తర్బూజా.. ఈ పండు చేసే మ్యాజిక్ మామూలుగా లేదుగా!
Gold Jewelry Buying | నగలు రెడీమేడ్​ తీసుకోవాలా..? చేయించాలా..? నిపుణులు ఏమంటున్నారంటే!
Eyes Liver Warning | కళ్లు ఇచ్చే డేంజర్ సిగ్నల్స్.. ఈ మార్పును నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు!
Women Stomach Pain | మహిళల్లో కడుపు నొప్పి.. ఏ ప్రాంతంలో నొప్పి వస్తే ఏ అనారోగ్యానికి సంకేతమంటే..!
Milk and Curd | ఎండలకు పాలు విరిగిపోతున్నాయా?.. ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు.. అస్సలు పాడవ్వవు!
TAGGED:Canine HydrationDog NutritionDr. Ashok PattanaikGodrej Ninja Pet FoodPet Digestive CarePet Summer HealthSummer Diet Reset
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jeevan Reddy KCR Meeting Jeevan Reddy KCR Meeting | నేడు కేసీఆర్​ను కలవనున్న మాజీ మంత్రి జీవన్​రెడ్డి
Next Article Hyderabad Drug Tests Hyderabad Drug Tests | రౌడీ షీటర్లకు డ్రగ్​ టెస్ట్​లు.. 190 మందికి పాజిటివ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?