అక్షరటుడే, వెబ్‌డెస్క్: Royal Enfield Flying Flea C6 | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ వాహన (Royal Enfield Electric Vehicle) మార్కెట్‌లోకి ప్రవేశించింది. ‘ఫ్లయింగ్ ఫ్లీ సీ6’ పేరుతో మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను గురువారం ఆవిష్కరించింది.
దీనిని కంపెనీ తన కొత్త సబ్ బ్రాండ్ ‘సిటీ ప్లస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ’ (City Plus Electric Mobility) కింద పరిచయం చేసింది. యువత, రోజువారీ రైడర్లను లక్ష్యంగా చేసుకుని ‘ఫ్లయింగ్ ఫ్లీ సీ6’ను ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. సిటీ, స్పోర్ట్స్ సహా 5 రకాల మోడ్‌లలో ఈ బైక్ లభించనుంది. దూర ప్రాంతం నుంచి లాకింగ్/అన్‌లాకింగ్ చేసుకోవచ్చు. ఈ బైక్ గురించి తెలుసుకుందామా..
ధర : ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (Electric Motorcycle) ఎక్స్ షోరూమ్ ధరను రూ. 2.79 లక్షలుగా నిర్ణయించారు. అయితే వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస’(బాస్) విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానాన్ని ఎంచుకుంటే రూ. 1.99 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. ఏప్రిల్ 10 నుంచి ప్రీ బుకింగ్ ప్రారంభం అవుతుంది. మే లో డెలివరీ చేయనున్నారు.
Royal Enfield Flying Flea C6 | స్పెసిఫికేషన్స్
ఈ బైక్‌లో 3.91 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. దీనికి 15.4 కేడబ్ల్యూ పీక్ పవర్‌ను ఉత్పత్తి చేసే పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (పీఎంఎసఎం)ను అమర్చారు. గరిష్టంగా గంటకు 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ¹3.7 సెకన్లలోనే సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంటోంది. ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే ఐడీసీ (ఇండియన్ డ్రైవింగ్ సైకిల్) స్టాండర్డ్స్ ప్రకారం 154 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ప్రకటించింది. ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ద్వారా 65 నిమిషాల్లో బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతం వరకు చార్జ్ చేయొచ్చని తెలిపింది.
Royal Enfield Flying Flea C6 | డిజైన్, ఫీచర్లు..
నగర ప్రయాణాలకు అనువుగా ఈ బైక్‌ను కాంపాక్ట్, ఆధునిక డిజైన్‌లో రూపొందించారు. డిజైన్ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది. ఫ్లోటింగ్ సీటు, అవసరం లేనప్పుడు తీసివేయగల పిల్లియన్ సీటు వంటివి మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
ఇందులో ఎలఈడీ హెడ్‌లైట్లు, గూగుల్ భాగస్వామ్యంతో పనిచేసే ఆన్‌బోర్డ్ నావిగేషన్ సిస్టమ్ ఇచ్చారు. వైర్‌లెస్ ఫోన్ చార్జింగ్ ప్యాడ్ ఉంది.
కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి భద్రత ఫీచర్లున్నాయి. స్పోర్ట్, ఇండివిడ్యువల్ వంటి రైడింగ్ మోడ్‌లు డ్రైవర్‌కు అందుబాటులో ఉన్నాయి.
బరువు 124 కిలోలు మాత్రమే..
ఫ్లయింగ్ ఫ్లీ సీ6 బైక్ బరువు 124 కిలోలు మాత్రమే. ఇప్పటివరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేసిన బైక్‌లలో ఇదే అత్యంత తేలికైనది.
ఇది కూడా చదవండి..: Indian Stock Market Gains | లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
