Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: US Iran Talks | పశ్చిమాసియాలో యుద్ధం ముగిసేనా?.. నేటి నుంచి అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - US Iran Talks | పశ్చిమాసియాలో యుద్ధం ముగిసేనా?.. నేటి నుంచి అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు

అంతర్జాతీయం

US Iran Talks | పశ్చిమాసియాలో యుద్ధం ముగిసేనా?.. నేటి నుంచి అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు

పశ్చిమాసియాలో యుద్ధం ముగించే విషయంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య తొలిసారి చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలపై ప్రపంచమంతా ఆసక్తితో ఉంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 11:51 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
13 గంటలు ago
Share
US Iran Talks

అక్షరటుడే, వెబ్​డెస్క్: US Iran Talks | పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమయ్యాక అమెరికా -ఇరాన్‌ల మధ్య తొలిసారి చర్చలు జరగబోతున్నాయి. ఇప్పటికే రెండు వారాలపాటు కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరుపక్షాలు.. శుక్రవారం నుంచి పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా జరగబోతున్న చర్చల్లో పాల్గొనబోతున్నాయి.

Contents
  • US Iran Talks | ఎన్నో అనుమానాలు..
    • US Iran Talks | చర్చల్లో పాల్గొనేదెవరంటే..
      • US Iran Talks | చర్చలు ఇలా..

ఈ చర్చలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. చర్చలు ఎలా జరుగుతాయని, ఇరు పక్షాలు డిమాండ్ల విషయంలో ఎలా స్పందిస్తాయి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయా అన్న విషయాలపై ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

US Iran Talks | ఎన్నో అనుమానాలు..

సీజ్ ఫైర్‌ (Cease Fire)కు ఇరు పక్షాలు అంగీకరించినా.. ఉల్లంఘనలు జరుగుతున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడంతో తాము చర్చలనుంచి వైదొలగుతామని ఇరాన్ పేర్కొంది. హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని తిరిగి మూసివేయడానికీ సిద్ధపడింది. మరోవైపు చర్చల ఫలితం తేలేదాకా తమ బలగాలను ఉపసంహరించబోమని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ (US President Trump) స్పష్టం చేశారు. దీంతో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. అయితే లెబనాన్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Israel PM Netanyahu) ప్రకటించడం ఊరటనిచ్చే విషయం. అమెరికా వేదికగా ఇరు దేశాల మధ్య వచ్చే వారం చర్చలు జరగొచ్చని భావిస్తున్నారు.

US Iran Talks | చర్చల్లో పాల్గొనేదెవరంటే..

ఇస్లామాబాద్‌లో జరిగే చర్చల్లో ఇరు దేశాలనుంచి ముగ్గురు చొప్పున ప్రతినిధులు పాల్గొననున్నారు. అమెరికా తరఫున ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పశ్చిమాసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు, మాజీ సలహాదారుడు జేర్డ్ కుష్నర్, ఇరాన్ నుంచి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘెర్ ఘాలిబఫ్, విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ఇరాన్ సైన్యం ప్రతినిధి ఒకరు పాల్గొంటారు.

US Iran Talks | చర్చలు ఇలా..

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif) ఉభయపక్షాలతో విడివిడిగా ప్రాథమిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. చర్చల సమయంలో అమెరికా, ఇరాన్ బృందాలు వేరువేరు గదుల్లో కూర్చోనున్నారు. పాక్ అధికారులు వీరి మధ్య రాయబారులుగా ఉంటూ ఒకరి సందేశాన్ని మరొకరికి చేరవేయనున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం, 10 పాయింట్ల ఫార్ములా, హార్మూజ్ జలసంధి తెరిచి ఉంచడంపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Hormuz Strait | హర్ముజ్​ను మళ్లీ మూసివేసిన ఇరాన్.. వార్నింగ్​ ఇచ్చిన ట్రంప్​

Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
Iran attacks | కువైట్, దుబాయ్​పై ఇరాన్ దాడులు
H1B Visa Changes | H-1B లాటరీ విధానం రద్దు.. ఇకపై వేతన ఆధారంగానే!
Iran Drone Attacks | డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్​ భీకరదాడులు
US Military Aircraft Crash | అమెరికా సైనిక రవాణా విమానం కూల్చివేత.. ఐదుగురు మృతి!
TAGGED:Cease FireIsrael PM NetanyahuPakistan PM Shehbaz SharifStrait of Hormuzus iran talksUS President Trump
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article KCR Political Strategy KCR Political Strategy | బీఆర్​ఎస్​లోకి జీవన్​రెడ్డి.. కేసీఆర్​ వ్యూహం అదేనా!
Next Article Volkswagen Taigun Facelift Volkswagen Taigun Facelift | న్యూ లుక్‌లో టైగన్ ఫేస్‌లిఫ్ట్..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?