Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Volkswagen Taigun Facelift | న్యూ లుక్‌లో టైగన్ ఫేస్‌లిఫ్ట్..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Volkswagen Taigun Facelift | న్యూ లుక్‌లో టైగన్ ఫేస్‌లిఫ్ట్..

బిజినెస్​

Volkswagen Taigun Facelift | న్యూ లుక్‌లో టైగన్ ఫేస్‌లిఫ్ట్..

వోక్స్‌వ్యాగన్ కంపెనీ తాజాగా భారత మార్కెట్‌లో టైగన్ ఫేస్‌లిఫ్ట్ ను లాంచ్ చేసింది. ఇందులో 40కిపైగా భద్రత ఫీచర్లున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 11:57 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
13 గంటలు ago
Share
Volkswagen Taigun Facelift

అక్షరటుడే, వెబ్​డెస్క్: Volkswagen Taigun Facelift | వోక్స్‌వాగన్ భారత్‌లో 2021లో టైగన్ ను విడుదల చేసింది. ఐదేళ్ల తర్వాత ఫేస్‌లిఫ్ట్ రూపంలో న్యూ మోడల్‌ను తీసుకువచ్చింది. ఈ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ (SUV) తన ప్రత్యేకమైన డ్రైవింగ్ డైనమిక్స్, భద్రతా ప్రమాణాలను కొనసాగిస్తూ కొత్త డిజైన్ తో, ప్రీమియం లుక్‌తో వచ్చింది.

Contents
  • Volkswagen Taigun Facelift | డిజైన్..
    • Volkswagen Taigun Facelift | ఫీచర్స్..
      • Volkswagen Taigun Facelift | సేఫ్టీ ఫీచర్స్..

న్యూ కలర్స్, మెరుగైన ఇంటీరియర్, ఆధునిక డిజిటల్ క్లస్టర్‌తో ఆకర్షణీయంగా ఉంది. టైగన్ ఫేస్‌లిఫ్ట్ హ్యుండాయ్ క్రెటా (Taigun Facelift vs. Hyundai Creta), కియా సెల్టోస్ వంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. దీని ఫీచర్లు తెలుసుకుందామా..

Volkswagen Taigun Facelift | డిజైన్..

ఈ ఎస్‌యూవీలోని కొత్త హెడ్‌లైట్స్ ఎలఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో అనుసంధానం అయ్యాయి. గ్రిల్ డిజైన్ కూడా అప్‌డేట్ చేశారు. అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్‌తో వచ్చాయి.
కొత్త టైగన్ అవకాడో పెర్ల్, స్టీల్ గ్రే రంగులలో లభిస్తుంది. మొత్తం 9 రంగులలో అందుబాటులో ఉంది.

Volkswagen Taigun Facelift | ఫీచర్స్..

ఇది 10.09 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఇది 15 విభిన్న అప్లికేషన్‌లను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఇందులో కొత్త 9 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ ఉంది. ఇది టర్న్ బై టర్న్ నావిగేషన్ అందిస్తుంది. ‘హలో వోక్స్‌వ్యాగన’ వాయిస్ అసిస్ట్ ఉంది. ఇది ఏసీ కంట్రోల్స్, మ్యూజిక్‌తోపాటు పలు ప్రాథమిక ఫంక్షన్‌లను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.

Volkswagen Taigun Facelift | సేఫ్టీ ఫీచర్స్..

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ కొలిజన్ బ్రేక్‌లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఇచ్చారు. భద్రతా ప్రమాణాల్లో 5 స్టార్ గ్లోబల్ ఎన్‌క్యాప్ రేటింగ్‌ను కొనసాగించారు. ఇందులో 40కిపైగా భద్రత ఫీచర్లున్నాయి.

ఇంజన్ : కొత్త వోక్స్‌వ్యాగన్ టైగన్ 1.0 లీటర్ టీఎసఐ, 1.5 టీఎసఐ ఈవీవో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ సుమారు 114 పీఎస్ పవర్ , 178 ఎనఎం(న్యూటన్ మీటర్) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది. పాత 6 స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్ స్థానంలో కొత్తగా 8 స్పీడ్ ఆటోమేటిక్‌ను ఇచ్చారు.
1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 147 పీఎస్ పవర్, 250 ఎనఎం టార్క్‌ను అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల మధ్య ఎంపికలను అందిస్తుంది. 1.5 లీటర్ ఇంజిన్‌లో యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ (ఏసీటీ) ఉండడం వల్ల అవసరమైనప్పుడు సిలిండర్లను ఆపి ఇంధనాన్ని ఆదా చేస్తుంది. మాన్యువల్ సుమారు 19.98 కేఎంపీఎల్, ఆటోమెటిక్ సుమారు 19.54 కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తుంది.

ఇది కూడా చదవండి..: Royal Enfield Flying Flea C6 | రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్..

Gold Prices Today | యుద్ధ ఉద్రిక్తతల నడుమ చల్లబడిన బంగారం ధర.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఊరట!
March 10 Gold Silver Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
March 15 Gold Rates | బంగారం, వెండి ధరల్లో స్వ‌ల్ప‌ మార్పులు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!
March 21 Gold Rates | పసిడి ధరలకు బ్రేక్… ఒక్కసారిగా భారీ పతనం, కొనుగోలుదారులకు ఊరట!
Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
TAGGED:auto news Indiacar featurescar launch newsmid size suvSUVSUV IndiaTaigun faceliftTaigun Facelift vs. Hyundai CretaVolkswagen IndiaVolkswagen Taigun Facelift
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article US Iran Talks US Iran Talks | పశ్చిమాసియాలో యుద్ధం ముగిసేనా?.. నేటి నుంచి అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు
Next Article RTC Employees DA Hike RTC Employees DA Hike | ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. డీఏ పెంచిన ప్రభుత్వం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?