అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RTC Employees DA Hike | తెలంగాణ (Telangana) ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2.1 శాతం డీఏ పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Transport Minister Ponnam Prabhakar) ప్రకటించారు. పెంచిన డీఏను 2026 జనవరి నుంచి అమలు చేస్తామన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులు (RTC Employees) తమ సమస్యల పరిష్కరించాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. డీఏ పెంచాలని కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో 50.7 శాతం ఉన్న డీఏ తాజా పెంపుతో 52.8 శాతానికి చేరింది. గడిచిన మూడు నెలలకు గాను ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా చెల్లించనున్నట్లు మంత్రి తెలిపారు.
RTC Employees DA Hike | రూ.2.82 కోట్ల భారం
పెరిగిన డీఏతో ఆర్టీసీపై ప్రతి నెల రూ.2.82 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి పొన్నం తెలిపారు. రాష్ట్రంలో చివరగా జూలై 2025 లో డీఏను 2.1శాతం పెంచారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పలు రీజియన్ల ఆర్ఎంలతో సమావేశం అయ్యారు. పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. డీఏ పెంచడంతో ఆర్ఎంలు మంత్రిని సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: KCR Political Strategy | బీఆర్ఎస్లోకి జీవన్‌రెడ్డి.. కేసీఆర్ వ్యూహం అదేనా!
