Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Samrat Choudhary CM | బీహార్ చరిత్రలో బీజేపీ కొత్త అధ్యాయం.. నూతన ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Samrat Choudhary CM | బీహార్ చరిత్రలో బీజేపీ కొత్త అధ్యాయం.. నూతన ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి?

జాతీయం

Samrat Choudhary CM | బీహార్ చరిత్రలో బీజేపీ కొత్త అధ్యాయం.. నూతన ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి?

బీహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సమ్రాట్ చౌదరి ఎన్నిక కానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 1:02 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
11 గంటలు ago
Share
Samrat Choudhary CM

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Samrat Choudhary CM | బీహార్ (Bihar) ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ (Nitish Kumar) ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏప్రిల్ 14వ తేదీన బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి ఎన్నిక అనివార్యం అయ్యింది.

Contents
  • Samrat Choudhary CM | తొలి నేతగా చరిత్రలో..
    • Samrat Choudhary CM | సమ్రాట్ రాజకీయ నేపథ్యం..

Samrat Choudhary CM | తొలి నేతగా చరిత్రలో..

అయితే ఈసారి బీజేపీకి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సమ్రాట్ చౌదరికే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి రేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా పేర్లూ పరిశీలనకు వచ్చినా.. పార్టీ మాత్రం సమ్రాట్ చౌదరి పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఆయన ముఖ్యమంత్రి అయితే బీహార్‌లో చరిత్రలో నూతన అధ్యాయం మొదలు కానుంది. బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అయిన తొలి నేతగా చరిత్రలో నిలిచిపోనున్నారు.

Samrat Choudhary CM | సమ్రాట్ రాజకీయ నేపథ్యం..

సమ్రాట్ చౌదరి 1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2000లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నిక (Bihar Assembly Election)ల్లో పర్బత్తా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఆయన.. రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి బిహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్‌గా నియమితులయ్యారు. 2014లో ఆర్జేడీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్(యూ) ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన 2018లో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party)లో చేరి బీహార్‌ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2024 జనవరి 28న నితీష్ కుమార్ మంత్రివర్గంలో చేరి, ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు.

ఇది కూడా చదవండి..: Mumbai Airport Fire | ముంబయి ఎయిర్​పోర్టులో అగ్ని ప్రమాదం.. భయాందోళనలో ప్రయాణికులు!

President protocol controversy | రాష్ట్రపతి ప్రొటోకాల్ వివాదం.. టీఎంసీపై ప్రధాని ఆగ్రహం
Bengaluru Hotels Closed | బెంగళూరు భోజనప్రియులకు షాక్.. నేటి నుంచి హోటల్స్ బంద్​!
Modi Preparedness Warning | దేశ ప్రజలు సవాళ్లకు సిద్ధంగా ఉండాలి.. మోదీ సంచలన వ్యాఖ్యలు
HPV Vaccination Launch | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ ప్రారంభించిన ప్రధాని మోదీ
Nagpur Explosives Seizure | భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
TAGGED:Bihar CM raceBihar politicsBJP BiharIndia politics newsIndian PoliticsNitish Kumarpolitical updatesSamrat ChoudharySamrat Choudhary CM
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article RTC Employees DA Hike RTC Employees DA Hike | ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. డీఏ పెంచిన ప్రభుత్వం
Next Article Facebook Love Fraud Facebook Love Fraud | ఫేస్​బుక్​లో పరిచయమై సహజీవనం.. రూ.కోటితో పరారు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?