అక్షరటుడే, వెబ్డెస్క్ : Facebook Love Fraud | సోషల్ మీడియా (Social Media)లో గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్లు, పరిచయాలు మంచివి కావని పోలీసులు చెబుతున్నా.. కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ మహిళ ఫేస్బుక్లో పరిచయం అయిన వ్యక్తితో సహజీవనం చేసింది. అంతేగాకుండా అతడికి రూ.కోటి ఇచ్చింది. అతడు పరార్ అవడంతో పోలీసులను ఆశ్రయించింది.
జూబ్లీహిల్స్ (Jubilee Hills)కు చెందిన మహిళకు గతంలోనే పెళ్లి అయింది. అయితే ఆమెకు ఫేస్బుక్లో సూరజ్ శర్మ అనే వ్యక్తితో పరిచయం అయింది. అదికాస్తా సహజీవనానికి దారి తీసింది. ప్రేమిస్తున్నానంటూ ఆమెను మభ్యపెట్టిన సూరజ్ శర్మ మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు.
Facebook Love Fraud | వ్యాపారినని చెప్పి..
హైదరాబాద్‌లో ముసారాంబాగ్ (Musarambagh)కు చెందిన సూరజ్ శర్మ కోఠిలో ఓ ఆటో మొబైల్ షాపులో పనిచేస్తున్నాడు. ఫేస్బుక్లో తాను సంపన్నడైన వ్యాపారిగా పరిచయం చేసుకున్నాడు. దీంతో నిజమేనని నమ్మిన సదరు మహిళ అతడితో సహజీవనం చేసింది. ఆతర్వాత.. వ్యాపారంలో అత్యవసరంగా డబ్బు అవసరం పడిందని అతడు ఆమెను నమ్మించాడు. దీంతో రూ.కోటి ఇచ్చింది. ఆ డబ్బులు తీసుకొని సూరజ్ శర్మ పరారు అయ్యాడు. దీంతో మోసపోయానని గ్రహించిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు (Jubilee Hills Police) నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..: RTC Employees DA Hike | ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. డీఏ పెంచిన ప్రభుత్వం
