అక్షరటుడే, వెబ్డెస్క్: Yashwant Varma Resignation | అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు.
ఢిల్లీలోని యశ్వంత్ వర్మ నివాసంలో గత సంవత్సరం లెక్కల్లో చూపని నగదు లభించింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ విచారణ సైతం కొనసాగుతోంది. ఆయనను తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆయనే రాజీనామా చేశారు. ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ 140 మందికి పైగా లోక్‌సభ సభ్యులు (Lok Sabha Members) ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు పలకడంతో, ఆయనపై అభిశంసన ప్రక్రియ వేగవంతమవుతున్న తరుణంలో రాజీనామాను రాష్ట్రపతికి పంపారు.
Yashwant Varma Resignation | అసలు ఏం జరిగిందంటే..
గత ఏడాది మార్చిలో ఢిల్లీలోని జస్టిస్ వర్మ (Justice Verma) అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. అయితే ఆ సమయంలో ఆయన ఇంట్లో భారీగా నోట్ల కట్టలను వారు గుర్తించారు. వారు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన న్యాయపరమైన విధులను నిలిపివేశారు.
ఇది కూడా చదవండి..: Samrat Choudhary CM | హార్ చరిత్రలో బీజేపీ కొత్త అధ్యాయం.. నూతన ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి?
