అక్షరటుడే, ఆర్మూర్: Armoor House Burglary | జన సంచారం ఉన్న ప్రాంతాల్లోనే దొంగలు దర్జాగా దోపిడీకి పాల్పడుతుండడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఆర్మూర్ (Armoor) పట్టణ పరిధిలో పట్టపగలే ఇల్లు దోచేశారు. భారీ ఎత్తున్న బంగారం దోపిడీకి పాల్పడ్డారు.
Armoor House Burglary | పెర్కిట్‌లోని విశాఖ కాలనీలో..
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ విశాఖ కాలనీలో (Visakha Colony) ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ కాలనీకి చెందిన వినోద్ కుమార్తెకు వివాహం త్వరలో జరగనుంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంటికి తాళం వేసి గ్రామదేవతలకు పూజలు చేయడానికి కుటుంబ సభ్యులతో వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి 14 తులాల బంగారం, రూ.లక్ష నగదు అపహరించారు. గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు పగులగొట్టి, ఇల్లంతా చిందరవందరగా ఉండడంతో చోరీ జరిగినట్లు భావించిన కుటుంబ సభ్యులు ఈ విషయమై ఆర్మూర్ పోలీసులకు (Armoor Police) ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి..: MeeSeva Center Application | మీసేవా కేంద్రం కోసం దరఖాస్తుల ఆహ్వానం
