Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Amit Shah Manifesto | అక్రమ చొరబాట్లపై చర్యలు.. నిరుద్యోగులకు రూ.3 వేలు : అమిత్​ షా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Amit Shah Manifesto | అక్రమ చొరబాట్లపై చర్యలు.. నిరుద్యోగులకు రూ.3 వేలు : అమిత్​ షా

జాతీయం

Amit Shah Manifesto | అక్రమ చొరబాట్లపై చర్యలు.. నిరుద్యోగులకు రూ.3 వేలు : అమిత్​ షా

బెంగాల్​లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. తాము అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోగా చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 10, 2026 3:05 సా.
Srinivas Kolluri
14 గంటలు ago
Share
Amit Shah Manifesto

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amit Shah Manifesto | పశ్చిమ బెంగాల్​లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ నాయకులు (BJP Leaders)  తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆ పార్టీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Amit Shah) విడుదల చేశారు.

Contents
  • Amit Shah Manifesto | మమత పాలన పీడకల
    • Amit Shah Manifesto | సరిహద్దులు సురక్షితం

తాము అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోగా చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ మేనిఫెస్టో (BJP Manifesto)లో పేర్కొంది. ప్రతి మహిళకు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల సహాయం, రాష్ట్ర ఉద్యోగుల కోసం ఏడవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ ‘సంకల్ప పత్రం’ను ఆవిష్కరిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ పత్రాన్ని ‘సోనార్ బంగ్లా’ను సృష్టించేందుకు ఒక మార్గసూచిగా అభివర్ణించారు.

Amit Shah Manifesto | మమత పాలన పీడకల

గత 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలన రాష్ట్ర ప్రజలకు ఒక “పీడకల”గా మారిందని షా ఆరోపించారు. బీజేపీ సంకల్ప పత్రం రైతులు, యువత, మహిళలకు మార్గనిర్దేశం చేస్తూ వారికి ఒక కొత్త దిశను చూపిస్తుందన్నారు. బెంగాల్ సంస్కృతి పట్ల గర్వపడే ప్రతి పౌరుడికి ఇది నూతన ఆశను అందిస్తుందని పేర్కొన్నారు. బెంగాల్‌లో పౌరులందరికీ ఒకే చట్టం ఉండేలా చూస్తామని తెలిపారు.

Amit Shah Manifesto | సరిహద్దులు సురక్షితం

రాష్ట్ర సరిహద్దులను సురక్షితం చేస్తామని, పశువుల అక్రమ రవాణాకు ముగింపు పలుకుతామని హామీ ఇచ్చారు. పోలీసు బలగంతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.బీజేపీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏడో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని షా అన్నారు.

ఇది కూడా చదవండి..: Dhar Murder Case | నల్లగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య

 

PNG Connections India | పెరిగిన పీఎన్‌జీ కనెక్షన్లు..
Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలవరం
Hormuz Tanker Green Asha | హార్మూజ్ దాటిన ‘గ్రీన్ ఆశ’.. 15,500 టన్నుల గ్యాస్‌తో వస్తున్న ట్యాంకర్
LPG Booking Interval | గ్యాస్​ సిలిండర్ల బుకింగ్​పై కేంద్రం కీలక నిర్ణయం
Kerala Elections | కేంద్ర నిధులను లెఫ్ట్​ పార్టీ లూటీ చేసింది : ప్రధాని మోదీ
TAGGED:Amit ShahAmit Shah ManifestoBengal politicsBJP LeadersBJP manifestoelection newsIndian Politicspolitical promisesunemployment aidwest bengal elections
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Dhar Murder Case Dhar Murder Case | నల్లగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య
Next Article Ganja Ban Velpur Ganja Ban Velpur | గంజాయిపై సమరశంఖం.. విక్రయిస్తే జరిమానా విధించేందుకు వేల్పూర్​లో తీర్మానం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?