అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: GGH Nizamabad | జిల్లా జనరల్ ఆస్పత్రి నిజామాబాద్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా (GGH superintendent) డాక్టర్ నాగమోహన్ (Nagamohan) నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME orders) నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
GGH Nizamabad | ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్..
ప్రస్తుతం నిజామాబాద్ (Nizamabad GGH) ప్రభుత్వ వైద్య కళాశాల/ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ (forensic medicine professor), విభాగాధిపతిగా డాక్టర్ నాగమోహన్ సేవలందిస్తున్నారు. ఆయనకు తాజాగా జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పి శ్రీనివాస్ పిడియాట్రిక్ హెచ్వోడీగా కొనసాగనున్నారు. ఈమేరకు డీఎంఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నాగమోహన్ బాధ్యతలు తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: మేడిపల్లిలో కళ్యాణ్ జ్యువెలర్స్ భారీ షోరూమ్.. ప్రారంభించనున్న సినీ తార శ్రీలీల
