Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kids Iron Foods | పిల్లల్లో రక్తం తక్కువగా ఉందా.. ఐరన్ పెంచే ఈ ‘సూపర్ ఫుడ్స్’ తినిపించాల్సిందే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Kids Iron Foods | పిల్లల్లో రక్తం తక్కువగా ఉందా.. ఐరన్ పెంచే ఈ ‘సూపర్ ఫుడ్స్’ తినిపించాల్సిందే!

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

Kids Iron Foods | పిల్లల్లో రక్తం తక్కువగా ఉందా.. ఐరన్ పెంచే ఈ ‘సూపర్ ఫుడ్స్’ తినిపించాల్సిందే!

తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఈ సహజ ఆహారాలను అలవాటు చేస్తే, వారు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఎదుగుతారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 10, 2026 9:11 సా.
Naresh chandan
6 గంటలు ago
Share
Kids Iron Foods
Kids Iron Foods

అక్షరటుడే,హైదరాబాద్: Kids Iron Foods | పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే పిల్లలు త్వరగా అలసిపోవడం, ఏకాగ్రత తగ్గడం, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు ఎదుర్కొంటారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Contents
  • Kids Iron Foods | హిమోగ్లోబిన్ పెంచే పోషకాహార నిధి:
    • Kids Iron Foods | రక్తకణాల ఉత్పత్తికి సమతుల్య ఆహారం:
      • విటమిన్-సి ప్రాముఖ్యం:

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పోషకాహార లోపం వల్ల చాలామంది పిల్లలు రక్తహీనత (Anemia) బారిన పడుతున్నారు. అయితే, మన వంటింట్లో దొరికే సహజసిద్ధమైన ఆహార పదార్థాలతోనే ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Kids Iron Foods | హిమోగ్లోబిన్ పెంచే పోషకాహార నిధి:

పిల్లల రక్తంలో ఎర్ర రక్తకణాల వృద్ధికి కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి.

రాగి జావ: రాగుల్లో క్యాల్షియంతో పాటు ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పిల్లలకు రాగి జావ ఇవ్వడం వల్ల వారి ఎముకలు దృఢంగా మారడమే కాకుండా రక్తహీనత సమస్య దరిచేరదు.

హలీమ్ గింజలు, కిస్మిస్: హలీమ్ గింజలు (Garden Cress Seeds) ఐరన్‌కు కేరాఫ్ అడ్రస్. వీటిని నానబెట్టి పాలు లేదా నీటితో ఇస్తే ఫలితం బాగుంటుంది. అలాగే ఎండుద్రాక్ష (కిస్మిస్) శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూ హిమోగ్లోబిన్ పెరగడానికి తోడ్పడతాయి.

నువ్వులు, అటుకులు: నువ్వుల్లో ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్ రక్తకణాల ఉత్పత్తికి సహాయపడతాయి. అటుకులు కూడా తక్కువ ఖర్చుతో కూడిన అద్భుతమైన ఐరన్ వనరు.

Kids Iron Foods | రక్తకణాల ఉత్పత్తికి సమతుల్య ఆహారం:

కేవలం ఐరన్ ఉన్న ఆహారం తీసుకోవడమే కాకుండా, శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు కూడా అందాలి. ఆకుకూరలు (ముఖ్యంగా తోటకూర, పాలకూర), పప్పుధాన్యాలు, గుడ్లు పిల్లల డైట్‌లో అంతర్భాగం కావాలి. మాంసాహారం తినే పిల్లలకు గుడ్లు ఇవ్వడం వల్ల మంచి ప్రోటీన్‌తో పాటు ఐరన్ కూడా లభిస్తుంది.”

విటమిన్-సి ప్రాముఖ్యం:

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. మనం ఎంత ఐరన్ ఉన్న ఆహారం తీసుకున్నా, అది శరీరానికి సక్రమంగా వంటబట్టాలంటే ‘విటమిన్-సి’ తప్పనిసరి. మనం తిన్న ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించేలా చేయడంలో విటమిన్-సి సహాయపడుతుంది.

అందుకే భోజనంతో పాటు లేదా భోజనం తర్వాత నారింజ, ఉసిరి, నిమ్మ వంటి పండ్లను పిల్లలకు ఇవ్వాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు రక్తం కూడా శుద్ధి అవుతుంది.

ఇది కూడా చదవండి..: Nosebleeds in Summer | వేసవిలో ముక్కు నుండి రక్తం వస్తోందా? భయపడకండి.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు!

ఇది కూడా చదవండి..: Kitchen Sponge Bacteria | వంటగదిలో అత్యంత ప్రమాదకరమైన వస్తువు ఇదే.. దీనిని మార్చలేదో ఈ రోగాలు గ్యారెంటీ!

Delhi Liquor Case Relief | ఢిల్లీ లిక్కర్​ కేసు.. కేజ్రీవాల్‌, కవితకు బిగ్​ రిలీఫ్
Lungs Transport Operation | బెంగళూరు నుంచి ఊపిరితిత్తులు.. గ్రీన్​ఛానెల్​ ఏర్పాటు చేసిన పోలీసులు
driving license grading points | డ్రైవింగ్​ లైసెన్స్​కు ఇక గ్రేడింగ్​ పాయింట్లు.. తప్పుల పుట్ట పెరిగితే లైసెన్స్​ రద్దు
Eye wear | కళ్లద్దాలు వాడుతున్నారా.. ఈ చిన్న తప్పులు చేస్తే కంటి చూపుకే ప్రమాదం!
March 22 Gold Rates | బంగారం, వెండి ధరల్లో భారీ పతనం.. దేశ వ్యాప్తంగా నేటి పరిస్థితి ఏమిటంటే!
TAGGED:anemia in childrenbloodchild health tipshealthy kids nutritionhemoglobin increaseiron rich dietKids Iron Foodsnatural iron sourcesvitamin c foods
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Lingampet Road Accident | Lingampet Road Accident | రెండురోజుల్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం
Next Article Skill University Telangana | Skill University Telangana | విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?