అక్షరటుడే, వెబ్‌డెస్క్: KCR Jeevan Reddy Meeting | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)ను ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి (Jeevan Reddy) శుక్రవారం కలిశారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరముందన్నారు.
‘‘మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించిండు అన్నా”అని జీవన్‌రెడ్డి అన్నారు. జీవన్‌రెడ్డిని కేసీఆర్ లంచ్‌కు ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన జగిత్యాల (Jagtial) నుంచి బయలుదేరి ఎర్రవెల్లికి వచ్చారు. వ్యవసాయ క్షేత్రంలో ఆయనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆహ్వానించారు. అనంతరం ఆయన కేసీఆర్‌ను ఆప్యయంగా ఆలింగనం చేసుకున్నారు.

KCR Jeevan Reddy Meeting | సంతోషంగా ఉంది
చాలా గ్యాప్ తర్వాత ఇన్నాల్లకైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని జీవన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డిని కేసీఆర్ సన్మానించారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశంలో కేటీఆర్ (KTR) మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: మేడిపల్లిలో కళ్యాణ్ జ్యువెలర్స్ భారీ షోరూమ్.. ప్రారంభించనున్న సినీ తార శ్రీలీల
