Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Indian Stock Market Surge | లాభాలతో ముగిసిన సూచీలు.. రూ. 6.85 లక్షల కోట్లు పెరిగిన సంపద
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Indian Stock Market Surge | లాభాలతో ముగిసిన సూచీలు.. రూ. 6.85 లక్షల కోట్లు పెరిగిన సంపద

బిజినెస్​

Indian Stock Market Surge | లాభాలతో ముగిసిన సూచీలు.. రూ. 6.85 లక్షల కోట్లు పెరిగిన సంపద

గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలబాటలో పయనించింది. సెన్సెక్స్ 918 పాయింట్లు, నిఫ్టీ 275 పాయింట్లు పెరిగాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 10, 2026 4:19 సా.
Srinivas Kolluri
11 గంటలు ago
Share
Indian Stock Market Surge

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Stock Market Surge | జియో పొలిటికల్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా స్టాక్ మార్కెట్లు (Stock Markets) రాణించాయి. ఐటీ ఇండెక్స్ అమ్మకాల ఒత్తిడికి గురైనా ఆటో, కన్జూమర్ గూడ్స్, ఫైనాన్షియల్ రంగాలలో బలమైన కొనుగోళ్ల కారణంగా సూచీలు పెరిగాయి. దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 490 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అక్కడినుంచి 270 పాయింట్లు కోల్పోయింది.

Contents
  • Indian Stock Market Surge | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
    • Indian Stock Market Surge | ఐటీ మినహా..

ఇంట్రాడే కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో తిరిగి పుంజుకుని 771 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో ప్రారంభమై 24 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 218 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 918 పాయింట్ల లాభంతో 77,550 వద్ద, నిఫ్టీ 275 పాయింట్ల లాభంతో 24,050 వద్ద స్థిరపడ్డాయి.

Indian Stock Market Surge | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ ఈలో నమోదైన కంపెనీలలో 3,360 కంపెనీలు లాభపడగా 945 స్టాక్స్ నష్టపోయాయి. 144 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 110 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 20 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 6.85 లక్షల కోట్లమేర పెరిగింది.

Indian Stock Market Surge | ఐటీ మినహా..

ఐటీ ఇండెక్స్ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి. ఆటో ఇండెక్స్ 2.85 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.27 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.22 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.11 శాతం, రియాలిటీ ఇండెక్స్ 2.08 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.99 శాతం, మీడియా 196 శాతం, పవర్ 1.92 శాతం లాభపడగా.. ఐటీ ఇండెక్స్ 1.91 శాతం నష్టపోయింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 25 స్టాక్స్ లాభపడగా.. 5 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ఆసియా పెయింట్స్ 3.84 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.22 శాతం, ఎంఅండ్ఎం 2.98 శాతం, ఇండిగో 2.77 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.49 శాతం లాభపడ్డాయి.

Losers : సన్‌ఫార్మా 3.65 శాతం, ఇన్ఫోసిస్ 2.94 శాతం, టీసీఎస్ 2.45 శాతం, టెక్ మహీంద్రా 1.44 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.90 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Royal Enfield Flying Flea C6 | రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్..

Banking Trust | భారతీయ బ్యాంకింగ్ రంగంలో మారుతున్న విశ్వసనీయత ప్రమాణాలు
Gold Prices Today | యుద్ధ ఉద్రిక్తతల నడుమ చల్లబడిన బంగారం ధర.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఊరట!
Motorola Edge 70 Fusion | మోటోరోలానుంచి మరో ఫోన్.. 6న లాంచ్ చేయనున్న కంపెనీ
Vedanta Women Workforce | వేదాంత సంచలన నిర్ణయం: కార్యశాలలో మహిళా వాటా 35 శాతానికి పెంపు
April 10 Pre Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ
TAGGED:BSE NSEDomestic Stock Marketfinancial updatesIndian Stock Market Surgemarket gainsNifty TodaySensex rallyshare market indiastock market newsStock Markets
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Maoists surrender Telangana Maoists surrender Telangana | మావోయిస్ట్​ రహితంగా తెలంగాణ : డీజీపీ
Next Article Nizamabad Drinking Water | Nizamabad Drinking Water | తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?