Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad Drinking Water | తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad Drinking Water | తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

నిజామాబాద్

Nizamabad Drinking Water | తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

జిల్లాలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన ఆన్​లైన్​ బూస్టర్ సిస్టంను తనిఖీ చేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 10, 2026 4:48 సా.
Shashi kiran Mottala
12 గంటలు ago
Share
Nizamabad Drinking Water |
Nizamabad Drinking Water | తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Drinking Water | జిల్లాలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పేర్కొన్నారు. ఈ మేరకు ఎడపల్లి మండలం జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన ఆన్​లైన్​ బూస్టర్ సిస్టంను (booster system) ఆమె శుక్రవారం తనిఖీ చేశారు.

Contents
  • Nizamabad Drinking Water | మారుమూల నివాస ప్రాంతాలకు నీరు చేరేవిధంగా..
    • Nizamabad Drinking Water | అనంతగిరి, పోచారం గ్రామాలకు..

Nizamabad Drinking Water | మారుమూల నివాస ప్రాంతాలకు నీరు చేరేవిధంగా..

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. జిల్లాలోని మారుమూల నివాస ప్రాంతాలకు (rural water supply) సైతం రక్షిత తాగునీరు సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇలా నీటిని సరఫరా చేసేందుకు ఆన్​లైన్​ బూస్టర్​ సిస్టం పనిచేస్తుందన్నారు. ఈ మేరకు సిస్టం పనితీరు.. ప్రయోజనాల గురించి గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిట్టచివరన ఉండే ఆవాసాలకు కూడా తాగునీరు చేరుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.

Nizamabad Drinking Water | అనంతగిరి, పోచారం గ్రామాలకు..

అనంతగిరి, పోచారం గ్రామాలకు సైతం తాగునీటి సరఫరా కోసం ఇదే తరహా ఏర్పాట్లు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కలెక్టర్ (Nizamabad news) అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తుగానే చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ప్రతి ఆవాస ప్రాంతానికి రక్షిత మంచి నీరు సరఫరా అయ్యేలా పక్కాగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. కలెక్టర్ వెంట ఆర్​డబ్ల్యూఎస్​ ఈఈలు రాకేష్, స్వప్న తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి : KCR Jeevan Reddy Meeting | మీతో పని చేయమని ఆ దేవుడే పంపాడు.. కేసీఆర్​తో జీవన్​రెడ్డి

Domestic Cylinders Seized | హోటల్​లో డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసిన అధికారులు
CT Scan Facility | టీహబ్ భవనంలో సీటీ స్కాన్ ఏర్పాటు: కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​
Dr Vishal Akula | ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ రాష్ట్ర కో ఛైర్మన్‌గా డాక్టర్​ విశాల్
Exam Paper Security | సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్ష పత్రాల బండిళ్లు తెరవాలి: కలెక్టర్​
RSS Nitya Shakha | ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం ‘నిత్యశాఖ’
TAGGED:booster systemCollector Ila Tripathigovernment initiativesNizamabad Newsrural water supplysummer water plan
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Indian Stock Market Surge Indian Stock Market Surge | లాభాలతో ముగిసిన సూచీలు.. రూ. 6.85 లక్షల కోట్లు పెరిగిన సంపద
Next Article Math Fear Students Math Fear Students | విద్యార్థుల్లో గణితంపై భయాన్ని పోగొట్టాలి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?